ఆర్ ఆర్ ఆర్.. టీజర్ వావ్ అద్భుతం.. మహాధ్బుతమంటూ జబ్బలు చరుకునేవారు. అబ్బే.. ఇదంతా కాఫీ కొట్టారంటూ ఎద్దేవా చేసినవారూ ఉన్నారు. ఏమైనా.. రాజమౌళి క్రియేటివ్ బుర్ర నుంచి పుట్టుకొచ్చిన సినిమా. అసలు తెలంగాణ కొమరం భీమ్.. ఆంద్ర అల్లూరి సీతారామరాజు మధ్య కథను అల్లటమే గొప్ప అనుకుంటే.. వారిద్దరి మద్య సీన్లు మరింత సూపర్ అంటున్నారట ట్రిపుల్ ఆర్ టీమ్. అంత వరకూ బాగానే ఉంది.. అల్లూరికి గొంతు అరువు వచ్చాడు కొమరం. కొమరంకు ఇప్పుడు అదే రిటర్న్ గిఫ్టు ఇచ్చాడు అల్లూరి. అంత వరకూ బాగానే ఉంది. ఇద్దరూ చారిత్రక పురుషులు.. పైగా స్వాతంత్ర సమరసింహాలుగా ఇప్పటి తరంలోనూ స్పూర్తి నింపుతున్నారు.
అసలు సమస్య ఫ్యాన్స్‌తోనే.. ఇప్పటికే నందమూరి, మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. జూనియర్ అద్భుతంగా చేశాడంటూ ఒకరు.. అబ్బే రామ్‌చరణ్ సూపరంటూ మరికొందరు. ఇద్దరు యువనటులు పోషిస్తున్న గొప్పపాత్రలను చూడాల్సిన అభిమానులు.. ఆ ఇద్దరి కులం.. పార్టీలను భుజాన మోస్తూ అభాసుపాల్జేస్తున్నారు. స్పోర్టివ్ స్పిరిట్ తో ఉన్న ఇప్పటిహీరోల ఐకమత్యం చూడముచ్చటగా ఉందంటూ గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశంసించారు. కానీ.. అభిమానుల్లో కొందరి దుడుకు స్వభావంతో మంచి వాతావరణం కలుషితమవుతోంది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇద్దరు హీరోల అభిమానులు ఓ మెట్టు కిందకు దిగారనే విమర్శలూ లేకపోలేదు. మా వాడు సూపరంటే.. మావాడు సూపర్ అనుకోవటం పొరపాటు కాదు. కానీ.. ఒకరి మనోభావాలు మరొకరు దెబ్బతీసేలా చేసుకుంటున్న కామెంట్స్ ఇబ్బంది అనిపిస్తున్నాయి. కొమరం భీమ్ పాత్రను మలచిన తీరుపై కూడా రాజమౌళిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ రచ్చ ఎంత వరకూ పోతుందనేది కాలమే నిర్ణయించాలి. లేకపోతే.. తమ అభిమానులకు ఆ ఇద్దరు కుర్రహీరోలే సుద్దులు చెప్పాలి.



