మందేస్తూ.. చిందేయరా.. ఇది పాత పాట.. మందేస్తూ.. ఛలానా కట్టారా ఇదీ పోలీసుల జరిమానా. నిజమే.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ.. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. కర్మకాలితే.. తమ ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. అందుకే.. సైబరాబాద్ పోలీసులు కాస్త కఠినంగా ఉన్నారు. ఎంతగా కఠినంగా ఉన్నారంటే.. 3551 మంది మద్యం తాగి వాహనం నడిపిన వారి లైసెన్సులు రద్దు చేశారు. మందేసేది.. అబ్బాయిలు.. పురుషులే కాదండోయ్.. ఆడంగులు కూడా ఉన్నారు.. వీళ్లు కూడా దాదాపు 50 మంది వరకూ పోలీసుల తనిఖీల్లో చిక్కారు. ఇంతకీ.. పోలీసులు మద్యం తాగిన వాహనాలు నడిపే వారికి ఎంత జరిమానా విధించారో తెలుసా.. అక్షరాలా రూ.165 కోట్లు.. ఇదీ ఓన్లీ సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ మాత్రమే.. రాచకొండ, హైదరాబాద్ పోలీసులు రెండు రెట్లు అధికంగానే వసూలు చేసి ఉంటారట. ఈ లెక్కన.. ఏటా గ్రేటర్ మందుబాబులు.. తాము తాగిన దానికంటే. తాగి బండి నడుపుతూ జరిమానాలకే ఎక్కువ డబ్బులు కట్టారట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. సైబరాబాద్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 3551 మంది లైసెన్సులు రద్దు చేయించిన పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 42 మంది మహిళలపై కేసులు పెట్టిన సైబరాబాద్ పోలీసులు. వీరిలో 854 మంది విద్యార్థులు, 75 మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ,2431 మంది వ్యాపారులు, 6340 ప్రయివేటు ఉద్యోగులు, 222 ప్రభుత్వ ఉద్యోగులున్నారు.



