దున్న‌పోతు ధ‌ర ఎంతో తెలుసా.. అక్ష‌రాలా రూ.26 కోట్లు!

దున్న‌పోతు క‌దా! అని ఈజీగా కొట్టేయ‌వ‌ద్దు.. దీని గురించి వింటే.. పుడితే దున్న‌పోతై పుట్టాల‌నిపించ‌క మాన‌దు.. అబ్బా అంత సీనుందా అనుకుంటున్నారా! అయితే వీటి గురించి తెలుసుకోవాల్సిందే. దీపావ‌ళి అంటే.. చిచ్చుబుడ్లు.. మ‌తాబు.. బాణ‌సంచా హంగామా మాత్ర‌మే కాదు.. తెలంగాణ‌లో ముఖ్యంగా హైద‌రాబాద్‌లో యాద‌వ్ సోద‌రులు నిర్వ‌హించే స‌ద‌ర్ ఉత్స‌వం గురించి తెలుసుకోవాల్సిందే. హ‌ర్యానా, యూపీ, ఎంపీ, తెలంగాణ త‌దిత‌ర రాష్ట్రాల నుంచి భారీ దున్న‌పోతుల‌ను ఇక్క‌డ‌కు తీసుకు వ‌స్తుంటారు. వీటి గురించి తెలుసుకోవాలంటే పెద్ద గ్రంథ‌మే అవుతుంది. స‌ద‌ర్‌లో పాల్గొనే ఒక్కో దున్న‌పోతు బ‌రువు స‌గ‌టున 1200-1700 కిలోల బ‌రువు ఉంటుంది. సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.26 కోట్ల వ‌ర‌కూ ధ‌ర ప‌లుకుతుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన హ‌ర్యానా జాతికి చెందిన ల‌వ్‌రాధా దున్న‌పోతు ఖ‌రీదు అక్ష‌రాలా రూ.26 కోట్లు. దీని దాణా.. కోసం మిన‌ర‌ల్ మిక్స‌ర్‌, డ్రైఫ్రూట్‌, 20-25 యాపిల్స్ రెండుసార్లు ఇస్తారు. 1600 కిలోల బ‌రువు, రోజూ 5 కిలోమీట‌ర్ల వాకింగ్‌, ఇద్ద‌రు త‌ప్ప‌కుండా ప‌ర్య‌వేక్షించాల్సిందే. పొడ‌వు 14 అడుగులు ఉంటుంది. 6.5 అడుగు ఎత్తు ఉంటుంది. స‌ద‌ర్ ఉత్స‌వాల‌కు తీసుకువ‌చ్చే అధిక‌శాతం దున్న‌పోతులు ఇదే విధంగా ఉంటాయి. వీట‌ని చూసేందుకు దేశ‌, విదేశాల నుంచి తీసుకువ స్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here