చిత్రలహరి, ప్రతిరోజ పండుగే, సోలో బతుకే సో బెటర్ హ్యాట్రిక్ విజయాలతో దూకుడు పెంచిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా రిపబ్లిక్ టీజర్ విడుదలైంది. విలక్షణ దర్శకుడు.. క్రియేటివ్‌కు మారుపేరు దేవ కట్టా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రిపబ్లిక్‌పై మెగా ఫ్యాన్స్‌లో బోలెడు అంచనాలున్నాయి. ఇప్పటి వరకూ కొవిడ్ వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ప్రాజెక్టు పట్టాలెక్కింది. కొత్తగా యువ రచయితలు ఈ సినిమా కోసం పనిచేశారు. పాత్రికేయ వృత్తిలో అపార అనుభవం ఉన్న రచయిత కలం నుంచి జాలువారిన డైలాగ్‌లు మాంచి కిక్కెస్తున్నాయి. ప్రభుత్వం, అధికారులు, న్యాయవ్యవస్థ మూడు ఏకతాటిపై పనిచేయటం ద్వారానే ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని అదే రిపబ్లిక్ అంటూ సాయిథరమ్ తేజ్ చెప్పిన డైలాగ్‌లు హీటెక్కిస్తున్నాయి సినిమాలకు అంచనాలను మరింత పెంచుతున్నాయి. దేవ కట్టా కూడా చాలా కష్టపడి సినిమా తీశారు. సినిమా కథపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. సాయిధరమ్ తేజ్‌కు సరిపడ కథ ఇన్నాళ్లకు వచ్చిందనే అభిప్రాయం కూడా అన్నయ్య వ్యక్తంచేసినట్టుగా తెలుస్తోంది. ఏమైనా టీజర్ దుమ్ము రేపుతోంది.