యాక్షన్.. డ్యాన్స్ అన్నింటా తనకు తానే అని నిరూపించుకుంటున్న నటి. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా గాకుండా తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు. అందుకే.. కోట్లు వచ్చే అవకాశం ఉన్న ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న యాడ్స్‌ను వద్దనుకున్నారు. మళయాళం, తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో బిజీగా మారారు. ఫిదా సినిమాతో ఒక్కసారిగా స్టార్‌డమ్ తెచ్చుకున్న సాయిపల్లవి. పడిపడి లేచే మనసులో ఆకట్టుకున్నారు. ఇప్పుడు తెలుగులో చిరంజీవి ఆచార్యలో మెరువబోతున్నారు. శేఖర్‌కొమ్ముల దర్శకత్వంలో లవ్‌స్టోరీ సినిమాతో తొలిసారి నాగచైతన్యతో మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. దాదాపు ఆ సినిమా నిర్మాణం పూర్తయిందట. దీంతో దిల్‌రాజు నేతృత్వంలో రాబోతున్న దాగుడుమూతలు సినిమా మల్టీస్టారర్‌గా తీయబోతున్నారట. శర్వానంద్, నితిన్ కుర్రహీరోలు నటించే ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా సాయిపల్లవి పేరు దాదాపు ఖరారైందట. మరో హీరోయిన్‌గా కీర్తిసురేష్‌ను అనుకుంటున్నట్టు సినీవర్గాల్లో వినికిడి. డ్యాన్సర్‌గా కనిపించి.. యాక్టరస్‌గా కొద్దిసమయంలోనే ఇంత ఇమేజ్ తెచ్చుకున్న సాయిపల్లవి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని నమ్ముతారట. ఇంటికి దూరంగా ఉన్నా.. తాను పనిచేసే సెట్‌ను కుటుంబ వాతావరణంగా మార్చుకుంటానంటోంది.