ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం చేసుకుని భారతదేశంలో గెలాక్సీ ఎఫ్ సిరీస్‌ను ఆవిష్కరించనున్న శాంసంగ్
• భారతదేశంలో వృద్ధి చెందుతున్న యువ కొనుగోలుదారుల ఆకాంక్షలను తీర్చే రీతిలో పూర్తిగా గెలాక్సీ ఎఫ్ లోడ్ చేయబడింది.
• ఎఫ్ సిరీస్‌లో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌గా గెలాక్సీ ఎఫ్ 41 రానుంది. అంతర్జాతీయంగా తమ ప్రవేశాన్ని భారతదేశంలో అక్టోబర్ 2020వ తేదీన చేయనుంది.
గురుగ్రామ్, ఇండియా – సెప్టెంబర్ 24,2020 ః భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నేడు, భారతదేశంలో అభివృద్ధి చెందిన ఈ–కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం చేసుకుని వృద్ధి చెందిన యువ వినియోగదారుల ఆంకాంక్షలను దేశంలో తీర్చనుంది. గెలాక్సీ ఎఫ్ సిరీస్‌ను ఫ్లిప్‌కార్ట్ యొక్క లోతైన వినియోగదారుల అవగాహన మరియు శాంసంగ్ యొక్క ఆవిష్కరణల శక్తితో నిర్మించారు. ఈ రెండు కంపెనీల నడుమ భాగస్వామ్యం ఈ పండుగ సీజన్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బిలియన్ డేస్‌లో వినియోగదారులకు ఆనందాన్ని తీసుకురానుంది.
గెలాక్సీ ఎఫ్ సిరీస్ యొక్క అంతర్జాతీయ ఆవిష్కరణ ద్వారా వృద్ధి చెందుతున్న యువ వినియోగదారుల ఆకాంక్షలను తీర్చనున్నారు. ఈ తరానికి స్మార్ట్‌ఫోన్ అనేది ఈ సమయంలో వారి సామాజిక, వ్యక్తిగత అవసరాల కోసం అత్యవసర ఉపకరణంగా మారింది. పరిశ్రమ నివేదికలు వెల్లడించే దాని ప్రకారం భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 2021 నాటికి 760 మిలియన్లకు చేరవచ్చని అంచనా. అధికశాతం మంది భారతీయులు తమ స్మార్ట్‌ఫోన్లను తమ పని లేదా విద్యా కారణాల కోసం రోజుకు కనీసం ఆరు గంటల పాటు వినియోగిస్తున్నారు. అత్యున్నత పనితీరు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం కోరిక కాదు, అవసరం అయింది.
‘‘శాంసంగ్ వద్ద, మేము వినియోగదారుల లక్ష్యత ఆవిష్కరణలను చేస్తున్నాము. గెలాక్సీ ఎఫ్‌ను భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో చేస్తున్నాము. సామాజికంగా విపరీత ఆసక్తిని ప్రదర్శించే యువతరం ఆకాంక్షలను ఇది వేడుక చేస్తుంది. గెలాక్సీ ఎఫ్‌తో, శాంసంగ్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకునే యువ వినియోగదారులకు సమృద్ధియైన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. గెలాక్సీ ఎఫ్ యొక్క ప్రతిపాదన ఫుల్ ఆన్– ఈ జీవనశైలి నేటితరపు యువ జెన్ జెడ్ వినియోగదారులను నిర్వచించనుంది. ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ ఫుల్ ఆన్ విశ్వసనీయతను ప్రదర్శిస్తాయి’’అని అసీమ్ వార్సీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్–ఈకామర్స్ బిజినెస్, శాంసంగ్ ఇండియా అన్నారు.
శాంసంగ్ తో భాగస్వామ్యం గురించి కళ్యాణ్ కృష్ణమూర్తి, సీఈవో, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ మాట్లాడుతూ‘‘దేశీయంగా అభివృద్ధి చెందిన కంపెనీగా మేము భారతీయ వినియోగదారుల మనోవాంఛను పూర్తిగా అర్థం చేసుకోవడంతో పాటుగా విలువైన ఉత్పత్తులను తీసుకురావడానికి భాగస్వామ్యాలపై పనిచేస్తున్నాము. శాంసంగ్‌తో మా వ్యూహాత్మక బాగస్వామ్యం, ప్రజల జీవితాలలో స్మార్ట్‌ఫోన్‌లు అసాధారణ విలువను తీసుకువస్తున్న వేళ, అత్యాధునిక సాంకేతికతలను 250 మిలియన్‌లకు పైగా వినియోగదారులకు భారత్ వ్యాప్తంగా తీసుకురావాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటించనుంది..’’ అని అన్నారు.
లక్షలాది మంది వినియోగదారులకు సహాయపడే రీతిలో అత్యంత అందుబాటు ధరలలో ఉత్పత్తులను ఎన్నో ఫ్లిప్‌కార్ట్ తీసుకువచ్చింది. అత్యాధునిక స్మార్ట్‌ఫోన్ ఆఫరింగ్స్‌ను ఇది అందించడంతో పాటుగా ఇప్పుడు కొనండి తరువాత చెల్లించండి, నో–కాస్ట్ ఈఎంఐలు, ఉత్పత్తి మార్పిడి, కార్డ్‌లెస్ క్రెడిట్ వంటి ఆఫరింగ్స్ సైతం అందిస్తుంది. ఇది వినియోగదారులకు తమఫోన్లను అత్యంత సులభంగా అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం అందిస్తుంది.
ఎఫ్ సిరీస్ గురించి ః
గెలాక్సీ ఎఫ్ సిరీస్‌ను రంగురంగుల జీవితాన్ని ఎలాంటి పరిమితులు, రాజీలూ లేకుండా జీవించాలనే తరం కోసం తీర్చిదిద్దబడింది. ఇది యువ భారతీయ షాపర్లకు పరిమితి లేకుండా అన్వేషించడం, వ్యక్తీకరించడం మరియు మునిగి తేలుతూ ఉండటం చేస్తుంది.
ఎఫ్ సిరీస్‌లో భాగంగా ఆవిష్కరించే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్ 41. వినియోగదారులు ఫుల్ ఆన్ అనుభవాలను గెలాక్సీ ఎఫ్41తో స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రతి కోణంలోనూ అందిస్తుంది. గెలాక్సీ ఎఫ్41 లో అత్యద్భుతమైన డిస్‌ప్లే, శక్తివంతమైన బ్యాటరీ, అత్యద్భుతమైన లుక్స్ వంటివి ఉంటాయి. ఇది ‘ఫుల్ ఆన్’ అనుభాలను సినిమాలు, గేమ్స్, సినిమాలు, వినోదంలో అందిస్తుంది.
గెలాక్సీ ఎఫ్ 41తమ అంతర్జాతీయ ప్రవేశాన్ని ఫుల్ ఆన్ ఫెస్టివల్‌లో ఆవిష్కరించనుంది. అక్టోబర్ 8వతేదీన ఇది జరుగనుంది. ఫుల్‌ఆన్ ఫెస్టివల్ ను ఆన్‌లైన్‌లో స్ర్టీమ్ చేయనున్నారు. ఇది ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ యొక్క ఎఫ్ సిరీస్ ఆవిష్కరణను ప్రత్యక్షంగా తీసుకురానుంది. మరింతగా తెలుసుకోవడానికి శాంసంగ్ మరియు ఫ్లిప్‌కార్ట్ యొక్క హ్యాండిల్స్ చూడండి మరియు ఫుల్ ఆన్ ఫెస్టివల్ కోసం నమోదు చేసుకోండి.