– ఈ 10 రోజుల బ్యూటీ ఫెస్ల్‌లో అద్భుతమైన కళాత్మకత, ట్యూటోరియల్స్, టాప్ బ్రాండ్ అనుభూతులు, ఆఫర్లు, దేశవ్యాప్తంగా మేకప్ టాలెంట్ హంట్‌తో ముందస్తు ఈవెంట్‌కు శ్రీకారం~
– అందం, కళాత్మకతకు సంబంధించి దేశవ్యాప్తంగా డిజిటల్ రూపంలో నిర్వహిస్తున్న టాలెంట్ హంట్‌కు న్యాయనిర్ణేతగా సెలబ్రిటీ జడ్జి శిల్పా శెట్టి కుంద్రాను తీసుకువస్తున్న షాపర్స్ స్టాప్
– ఈ బ్యూటీ ఫెస్టివల్‌లో భాగంగా ఇన్-స్టోర్స్, ఆన్‌లైన్‌లో దేశంలోని టాప్ బ్యూటీ బ్రాండ్స్, ఇన్‌ఫ్లూయన్సర్స్‌తో ట్యూటోరియల్స్, మాస్టర్ క్లాసులు
– ఈ చర్యలో భాగంగా ఆవిష్కరిస్తున్న లిమిటెడ్ ఎడిషన్ షోస్టాపర్స్ కిట్స్ స్టోర్స్‌లో లభ్యం
– అంతర్జాతీయ మేకప్, స్కిన్ కేర్, ఫ్రాగ్రెన్స్ బ్రాండ్ల కొత్త ఆవిష్కరణలు, ప్రత్యేక ఆఫర్స్ పరిశీలించండి
To participate:
Hyderabad, అక్టోబర్ 7, 2021: భారతదేశపు ప్రముఖ ఫ్యాషన్, బ్యూటీ డెస్టినేషన్ షాపర్స్ స్టాప్, షోస్టాపర్స్ రెండో ఎడిషన్‌ను ప్రకటించింది. బ్యూటీ ట్రెండ్స్, టాలెంట్స్, క్రియేటివిటీ, అద్భుతమైన ఆఫర్లు, మాస్టర్ క్లాసులు, అనుభూతులను ఇది అందిస్తుంది. ఈ 10 రోజుల బ్యూటీ ఫెస్టివల్‌లో భాగంగా దేశవ్యాప్తంగా టాలెంట్ హంట్ ఉంటుంది. దీనికి జడ్జిగా విలక్షణ నటి శిల్ఫా శెట్టి కుంద్రా వ్యవహరించనున్నారు. అక్టోబర్ 8 నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో శుక్రవారం 15 అక్టోబర్, 2021 మొదలై ఆదివారం, అక్టోబర్ 24, 2021 వరకు సాగుతుంది. సౌందర్య పిపాసులు గొప్ప ఆఫర్లు పొందేందుకు ఈ ఫెస్ట్ అంతులేని అవకాశాలు కల్పించడంతో పాటు వారి కళాత్మకతను చూపే అవకాశాన్ని అందిస్తుంది.
ఈ షోస్టాపర్స్‌లో ప్రముఖ బ్యూటీ బ్రాండ్స్ ఎం.ఎ.సి., డియోర్, క్యాల్విన్ క్లెయిన్, ఆర్సెలియా, బాబీ బ్రౌన్, కామ ఆయుర్వేద, ల్యాక్మె, మెబిలైన్, లోరియల్, కలర్‌బార్, ప్లస్ వంటి బ్రాండ్లు పాల్గొంటున్నాయి. అంతే కాదు క్రియేటివిటీ, ట్రెండ్స్, ఎడ్యుటైన్‌మెంట్ కలబోసి ప్రముఖ బ్యూటీ బ్రాండ్లు, ప్రఖ్యాత సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు కలిసి రూపొందించిన కంటెంట్‌ను ఈ ఫెస్ట్ ప్రదర్శిస్తుంది.
షాపర్స్ స్టాప్ స్టోర్స్ అంతటా ఎక్స్‌పీరియన్స్ జోన్స్ ఏర్పాటు చేయబడ్డాయి, ఇవి నిపుణుల ద్వారా వ్యక్తిగతమైన స్కిన్ కేర్ కన్సల్టేషన్, బ్యూటీ మాస్టర్ క్లాసులు, లైవ్ సెషన్స్, వ్యక్తిగత ఫ్రాగ్రెన్స్, విద్య, ఫ్లాష్ ఆపర్స్ అందిస్తాయి. ప్రముఖ పార్టనర్ బ్రాండ్స్‌తో కలిసి షాపర్స్ స్టాప్ ప్రత్యేకమైన స్పెషల్ ఎడిషన్ షోస్టాపర్ కిట్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవి, ప్రముఖ బ్రాండ్స్‌పై అదరిపోయే ఆఫర్లు కూడా స్టోర్స్‌లో ఉన్నాయి.
భారతదేశంలోని మేకప్ ఔత్సాహికులకు థ్రిల్‌తో పాటు అద్భుతమైన జ్ఞానాన్ని అందించే ఈ సంవత్సరపు భారీ బ్యూటీ వేడుకకు సిద్ధంకండి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం @shoppers_stop ’s ఇన్‌స్టాగ్రామ్ పేజీ గమనించండి.