గాయని ఉపద్రుష్ట సునీత. పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావోనంటూ.. గాత్రంతో కోట్లాది మంది అబిమానులను సొంతం చేసుకున్నారు. సినీ రంగంలో ఎక్కడా వివాదాలకు అవకాశం ఇవ్వకుండా వెళ్తున్నారు. గాయనిగానే గాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ఎంతోమందికి గాత్రదానం చేశారు. నంది పురస్కారాలు అందుకున్నారు. కానీ.. కుటుంబపరంగా ఎన్నో ఇబ్బందులు చవిచూశారు. భర్తతో తరచూ చికాకులు.. ఇబ్బందులతో ఇద్దరు పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేయగలిగారు.
వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కెరీర్‌పై ప్రభావం పడకుండా చాలా బ్యాలెన్స్‌గా నడిపిస్తూ వచ్చారు. భర్త నుంచి విడాకులు పొందిన తరువాత సునీత మరో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఒకసారి సునీత దీనిపై స్పందించారు. అలాంటి ఆలోచన ప్రస్తుతానికి లేదంటూ బదులిచ్చారు. కానీ రెండుమూడ్రోజులుగా సునీతకు మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ జరిగిందని.. రెండు కుటుంబాలు మాత్రమే పాల్గొన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై సునీత నుంచి ఎటువంటి స్పందన రాకపోవటంతో.. ఇది నిజమేనా అనే అభిప్రాయం అభిమానుల్లో ఉంది. టాలీవుడ్‌లో కూడా ఇప్పుడు ఇదే హాట్ న్యూస్‌గా మారింది. ఇటీవలే నిర్మాత దిల్‌రాజు సతీమణి వియోగం తరువాత మనుమరాలు ఉన్న వయసులోనూ జీవితభాగస్వామి కోసం ఒక యువతిని వివాహమాడారు. ఇప్పుడు ఇదే వరుసలో సునీత కూడా అనేది ప్రస్తుతం వినిపిస్తున్నమాట. అతడికి కూడా ఇది రెండో వివాహంగానే తెలుస్తోంది.