పుష్పరాజ్‌గా.. బన్నీ కొత్త రూపంలో అభిమానులకు ఖుషీ చేయబోతున్నారు. కరోనా వల్ల కొద్దికాలం వాయిదాపడిన సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. తూర్పుగోదావరిజిల్లా మారేడుపల్లిలో కీలక సన్నివేశాలు పూర్తిచేసుకున్నారు. పటాన్‌చెర్వు సమీపంలో కీలకమైన దృశ్యాలు.. పైటింగ్ సీన్లు తీస్తున్నట్టుగా తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎవ్వరూ ఊహించనది విధంగా.. అద్భుతమైన మేనరిజమ్స్‌తో అలరించనున్నాడట. ఇదిలా ఉంటే.. విలన్‌గా మరో అద్భుతమైన కమెడియన్, సహనటుడు.. సునీల్ కీలక రోల్ పోషించబోతున్నారని ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని విధంగా సునీల్ పాత్ర తెరకెక్కించబోతున్నారట సుకుమార్. రంగస్థలం మించిన విధంగా కేరక్టరైజేషన్లో సుక్కూ జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ లెక్కన.. తెలుగు సినిమాకు కొత్త విలన్ సునీల్ రూపంలో పరిచయం కాబోతున్నారన్నమాటే.