కుటుంబాన్ని ప్రేమించటం తెలిసిన వారికే. సమాజాన్ని ప్రేమిస్తారంటారు తత్వ వేత్తలు. అమ్మను ఆరాధించే చిరంజీవి.. తోబుట్టువులను గుండెల్లో పెట్టుకుని చూసుకుని మెగాస్టార్ ఇప్పుడు సమాజాన్ని ఆదుకుంటున్నారు. నేనుసైతం అంటూ కరోనా సమయంలో చేదోడుగా నిలుస్తున్నారు. ఎంతమంది బురద జల్లాలని చూసినా చిరునవ్వుతో సమాధానమిస్తున్నాడు. కిండపడేయాలని చూసినపుడు అలలా ఎగసిపడ్డాడు. దెబ్బకొట్టాలని చూసినపుడు చాకచక్యంగా తప్పుకున్నాడు. కొందరివాడే నంటూ ఎద్దేవాచేస్తుంటే అందరివాడుగా నిలిచాడు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండటం నేర్చుకున్నాడు. పంచుకోవటం నేర్పించాడు. ఇవన్నీ చిరంజీవి గురించి ఎవర్ని అడిగినా చెప్పే విషయాలు. 1980ల్లో మొదలైన సినీ ప్రస్థానాన్ని 2021 వరకూ కొనసాగిస్తూ మెగాస్టార్‌గా ఎదిగారు. చిరంజీవిని దెబ్బతీయాలంటే ఏం చేయాలి. ఎలా కింపడేయాలని చూసినా తనలోని మంచితనం కుటుంబాన్నే హీరోలుగా చేసింది. సుమన్‌ను జైలులో పెట్టించింది చిరంజీవేనంటూ అభియాగాలు. అదే సుమన్ మీడియాతో చిరంజీవి మేనుశిఖరం అంటూ ప్రశంచించాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి శ్రీకాంత్ వంటి వాళ్లు హీరోలుగా ఎదిగేందుకు చిరంజీవే స్పూర్తి. ఇలా ఒకరిద్దరు కాదు.. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం స్వయంగా తన పాటకు చిరంజీవి డ్యాన్స్‌తోనే న్యాయం జరుగుతుందంటూ బహిరంగంగా చెప్పారు.
కమల్‌హాసన్, రజనీకాంత్ కలయిక చిరంజీవి అంటూ దర్శక దిగ్గజం బాలచందర్ ఏనాడో మెగాస్టార్ కీర్తిని ప్రస్తుతించారు. చిరంజీవి అంటేనే ఎగిరిపడే మోహన్‌బాబు కూడా చిరంజీవి తెలుగు సినిమాకు పెద్దదిక్కు అన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు.. తెలుగు సినిమాలో 1 నుంచి 100 స్థానాలు చిరంజీవే నంటూ 20 ఏళ్ల క్రితమే చెప్పారు. బ్లడ్‌బ్యాంకు పెట్టి రక్తదానం చేస్తుంటే.. రక్తంతో వ్యాపారం అన్నారు కుసంస్కారులు. నిన్న ఆక్సిజన్ సిలిండర్లు ఇస్తు ప్రాణం పోస్తుంటే.. చిరంజీవి ఆక్సిజన్ వ్యాపారం చేస్తున్నాడంటూ విమర్శించారు. ఇలా ఎంతమంది ఎన్ని అన్నా చిరంజీవి బాధపడట్లేదు. ఎందుకంటే ఆయన ఆచార్య.. పాఠాలు నేర్పటం తెలుసు.. తన చేతల ద్వారా గుణపాఠాలు నేర్పించటం తెలుసు. అందుకే. ఆచార్య దేవో భవ.. చిరంజీవి సుఖీభవ అంటోంది కోట్లాదిమంది అభిమానం.