అందుకే ఆయ‌న మెగాస్టార్‌!

మెగాస్టార్‌లు ఊరికే కారు. రాత్రికి రాత్రే ఆ కుర్చీలో అప్ప‌నంగా కూర్చోలేదు. ఎన్ని రాళ్ల‌దెబ్బ‌లు.. మ‌రెన్ని ఉలిపోట్లు తిని ఉంటాడో.. తెలుగు సినిమా అంటే.. కుల ప్ర‌భావానికి ప‌రాకాష్ట‌. అటువంటి వెండితెర‌పై మామూలు కానిస్టేబుల్ కుమారుడు కొణిదెల శివ‌శంక‌ర ప్ర‌సాద్‌.. క‌ళామ‌త‌ల్లి ముద్దు బిడ్డ‌గా వెల‌గాల‌ని.. త‌న‌ను తాను నిరూపించుకోవాల‌నే క‌సితో చెన్నై వీధుల్లోకి చేరాడు. నీ ముఖానికి న‌టుడివా అంటారేమోన‌ని.. పాండీబ‌జార్ వైపు క‌న్నెత్తి చూడ‌లేద‌నేవారు. ఎంత గొప్ప సంక‌ల్పం లేక‌పోతే.. అంత దృఢంగా ఉండ‌టం సాధ్య‌మ‌వుతుంది. అప్ప‌టికే తెలుగు సినిమా తెర‌పై ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ‌, శోభ‌న్‌బాబు వంటి హీరోలు రాజ్య‌మేలుతున్నారు. అటువంటి ఉద్దండుల మ‌ధ్య నిండైన జుట్టు.. క‌ట్టిపడేసే క‌ళ్ల‌తో 5.7 అడుగుల కుర్రాడు సిని ప‌రిశ్ర‌మ‌ను ఆక‌ట్టుకున్నాడు. కేవ‌లం న‌ట‌న‌తోనే కాదు.. క‌ష్టానికి.. గౌర‌వానికి ప్ర‌తీక‌గా నిలిచాడు. సీనియ‌ర్ న‌టులు సెట్‌లోకి రాగానే లేచి నిల‌బ‌డి కుర్చీ చూపేంత‌టి గొప్ప‌ద‌నం చిరంజీవి సొంతం అంటారు న‌టుడు గిరిబాబు. అప్ప‌టి సినీ జ‌ర్న‌లిస్టులైతై చిరంజీవి గురించి బ‌య‌ట చెప్పేవ‌న్నీ పుకార్లు.. తాను ఎదిగే కొద్దీ ఒదిగే ఉన్నారు. త‌న‌తోపాటు కుటుంబాన్ని, స్నేహితుల‌ను కూడా ఎదిగేందుకు ఊత‌మిచ్చాడు. ఒక స్నేహితుడికి రైల్వేలో ఉద్యోగం.. మ‌రో స్నేహితుడికి ఆర్దిక సాయం.. మ‌రో నేస్తానికి అనారోగ్య స‌మ‌స్య వ‌స్తే.. అపోలోలో చేర్పించి ప్రాణం పోశాడు. నారాయ‌ణ‌రావు, హ‌రిప్ర‌సాద్‌, సుధాక‌ర్ వంటి వాళ్లు ఆర్ధికంగా ఎదిగేందుకు య‌ముడుకి మొగుడు సినిమా రెమ్యునురేష‌న్ లేకుండా చేశారు . న‌టుడు శ‌ర‌త్‌కుమార్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉంటే.. డేట్స్ ఇచ్చి ఉచితంగా సినిమాలో న‌టించిన గొప్ప మ‌న‌సు చిరుకు గాక ఎవ‌రికి ఉంటుంది. అయినా.. చిరంజీవి ని విమ‌ర్శించాల్సిందే. డ్రైవ‌ర్‌కు కూడా జీతాలివ్వ‌డు. ప‌నిచేసేవాళ్ల‌కు మ‌ర్యాద ఇవ్వ‌డంటూ కారుకూతలు కూసే బ్యాచ్ మాట‌లే బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతుంటాయి.

ఇప్పుడెందుకీ స‌మాచారం అంటారా.. సినీ కార్మికుల‌కు చిరంజీవి చేసినంత మేలు ఎవ్వ‌రూ చేయ‌లేరు.. చేయ‌లేద‌నేది అంద‌రికీ తెలిసిందే. అయినా.. చిరంజీవి ఏం చేశాడంటారు. సీసీసీ అనే చారిటీ ద్వారా క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో వేలాది మంది సినీ కార్మికుల‌కు ఉచితంగా నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేశారు. అందాకా ఎందుకు.. లాక్‌డౌన్ వేళ రామ్‌చ‌ర‌ణ్ ట్రాఫిక్ పోలీసుల‌కు మ‌జ్జిగ‌, భోజ‌న ప‌దార్ధాలు పంపిణీ చేసిన సంగ‌తి ఎంత‌మందికి తెలుసు. ఇప్పుడు అదే బాట‌లో మెగాస్టార్ క‌రోనా టీకా ఉచితంగా పంపిణీ చేయ‌నున్నారు. సినీ కార్మికుల‌కు, సినీ జ‌ర్న‌లిస్టుల‌కు కుటుంబ స‌భ్యుల‌కూ గురువారం నుంచి ఇవ్వ‌నున్నారు. అపోలోతో క‌ల‌సి చేప‌ట్టిన మ‌హాయ‌జ్ఞం.. మెగాస్టార్ మ‌న‌సును చాటింది. శ్రీరావ‌న‌వ‌మి ముందురోజు.. తీసుకున్ననిర్ణ‌యం వేలాది సినీ కార్మికుల కుటుంబాల‌కు భ‌రోసానిచ్చేలా చేసింది. అంతేనా.. వీరికి 3 నెల‌ల పాటు ఉచిత వైద్యం కూడా అందించేందుకు చిరంజీవి ఏర్పాట్లు చేశారు. అందుకే.. మెగాస్టార్ అంటే.. మెగాస్టారే.. సినీమాలు చేస్తే.. రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన హీరోలు స్టార్‌లు అవుతారేమో కానీ.. గొప్ప వ్య‌క్తిత్వం.. అంత‌కు మించిన మాన‌వత్వం ఉన్న చిరంజీవి వంటి వారు మాత్ర‌మే మెగాస్టార్‌లు కాగ‌ల‌రు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here