వకీల్‌సాబ్…. మూడేళ్ల గ్యాప్ తరువాత వచ్చినా అదే క్రేజ్. చెక్కు చెదరని ఇమేజ్. ప్రత్యర్థులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా పవన్ చరిష్మా ముందు అవన్నీ దూదిపింజాలుగా తేలిపోయాయి. జనసేన పార్టీతో రాజకీయాల్లో కీలకంగా మారిన పవన్ కళ్యాణ్ సినిమా మూడేళ్ల తరువాత విడుదలైంది. అభిమానులు , కార్యకర్తలు ఉత్సాహాన్ని చూసిన వైరివర్గం దీన్ని అడ్డుకోవాలని చూసింది. కోర్టు ముంగిట చేరి మరీ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. అయినా.. వకీల్ సాబ్ బ్లాక్‌బస్లర్ హిట్‌ను నిలుపలేకపోయారు. ఏప్రిల్ 9న విడుదలైన వకీల్‌సాబ్ ఇటీవలే ప్రైమ్ వీడియోస్ ఓటీటీపై విడుదలైంది. కరోనా కారణంగా సినిమాను థియేటర్లలో చూడలేని కోట్లాదిమంది ఇంట్లో హోమ్ థియేటర్‌లో ఎంజాయ్ చేశారు. మళ్లీ మళ్లీ చూస్తూ.. పవన్ అభిమానులంటే ఎలా ఉంటారనేది చాటారు. అంతే… ప్రైమ్ వీడియోస్ లో కూడా వకీల్ సాబ్ సత్తా చాటుకుంది. ఓటీటీల్లోనూ రికార్డులు సృష్టిస్తున్న పవర్‌స్టార్ మూవీ.. మున్ముందు ఇంకెన్ని రికార్డులు బద్దలు చేస్తుందనేది వేచిచూడాల్సిందే.



