మాజీ శాసనసభ్యుడు కె.పి.ఆర్.ఐ.టి విధ్యాసంస్థల అధినేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మాతగా సాయిప్రగతి ఆర్ట్స్ పతాకంపై బహుముఖ ప్రజ్ఞాశాలి యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పకులుగా ‘వేదవ్యాస్’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే . వినాయక చవితి పండగ అనగానే ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం గుర్తుకువస్తుంది ఎవరికైనా. ఆ గణపతిని దర్శించుకోవటానికి భక్తులు పోటీపడతారు. అందుకే ఆ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసి ఆ గణపతి ఆశీస్సులు అందుకున్నారు ‘వేదవ్యాస్’ సినిమా యూనిట్ నిర్మాత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, దర్శకుడు యస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి, హీరో పిడుగు విశ్వనాథ్‌లు.
దర్శనానంతరం నిర్మాత ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ– ‘ మా వేదవ్యాస్ సినిమా టీమందరం మహా గణపతిని దర్శించుకుని పూజించటం ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు కృష్ణారెడ్డి గారు సినిమాని ఎంతో గొప్పగా తెరకెక్కించారు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తాం అంటూ ఖైరతాబాద్ వినాయకుని మండప నిర్వాహకులకు చెక్కును అందించారాయన’’.
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ–‘‘ వేదవ్యాస్ సినిమా టీమ్‌తో వచ్చి గణేష్‌ను దర్శించుకున్నాం. ప్రజలందరికి ఆయన ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
చిత్ర సమర్పకులు అచ్చిరెడ్డి మాట్లాడుతూ–‘‘ మా సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది. కృష్ణారెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సినిమాని తెరకెక్కించారు. ప్రతి ప్రేక్షకునికి ఈ సినిమా నచ్చుతుంది. ఆ గణేశ్‌ని ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
హీరో పిడుగు విశ్వనాథ్ మాట్లాడుతూ–‘‘ ఈ జనరేషన్ జ¯Œ జీకి కూడా నచ్చే అంశాలతో తెరకెక్కించిన చిత్రం ‘వేదవ్యాస్’. ఏఐ జనరేషన్లో కూడా వేదాలు , మన సంస్కృతి గురించిన బ్యాక్‌గ్రౌండ్‌లో కథ ఉంటుంది. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సుల వల్లే నాకు ఇంతమంచి సినిమా ఇంత పెద్ద దర్శకునితో చేసే అవకాశం మొదటి సినిమాతోనే వచ్చింది. వచ్చే ఏడాది కల్లా నన్ను పెద్ద హీరోగా నిలబెట్టాలని ఆ మహా గణపతిని కోరుకుంటున్నా’’ అన్నారు.
చిత్ర సహ నిర్మాత మేడపాటి శ్రీనివాస్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు తదితరులు మహా గణపతిని దర్శించుకున్నారు.


