సీనియర్ సిటిజన్స్… నిన్నటి తరంలో ప్రపంచాన్ని నడిపించిన యువకులు. నిజమే. ఇప్పుడున్న యూత్.. తరువాత స్టేజ్ కూడా అదే అని గుర్తించాలి. అందుకేనేమో.. తాత తల వద్ద పెట్టిన చిప్ప.. తరువాత ఎవరనేది గుర్తుంచుకోవాలి. బాల్యంలో అమ్మనాన్నలను చూస్తూ పెరిగే పిల్లలు చాలా గమనిస్తారు. రేపటి అడుగులకు.. కన్నవారు చేసే పనులే ప్రేరణ. ఆ చిన్న మనసులు అన్నీ గుర్తంచుకుంటాయి. ఎలా అంటారా.. తాత, బామ్మలను తమ తల్లిదండ్రులు ఎలా చూసుకుంటున్నారు. వారి పట్ల ఎలా మెలుగుతున్నారనేది కీన్‌గా అబ్జర్వ్ చేస్తారు. అందుకే.. అది గమనించిన పెద్దలు తాతకు పెట్టిన చిప్ప అంటూ ఏ నాడో చెప్పారు. 2020లో ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల మంది వరకూ 60 ఏళ్లు పైబడిన వృద్ధులు ఉంటారని అంచనా. ఏపీ, తెలంగాణల్లో పింఛను తీసుకుంటున్నవారే లక్షల్లో ఉంటారు. అందర్నీ కలుపుకుంటే ఇక్కడా 40 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా వేసుకుందాం. వీరిలో ఎంతమందికి బిడ్డలు దగ్గరగా ఉంటున్నారు. ఎంతమంది వారికి కడుపునిండ భోజనం పెడుతున్నారనేది చెప్పటం కష్టమే. లాక్‌డౌన్.. కరోనాతో వృద్ధులు మరింత నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వీరికి టాటాట్రస్ట్, విజయవాహిని ఛారిట్రబుల్‌ట్రస్ట్, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో 14567 అనే టోల్‌ఫ్రీనెంబరు నిర్వహిస్తుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ నెంబరు ద్వారా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అందుబాటులో ఉంటారు. వీరికి సీనియర్ సిటిజన్లు చవిచూస్తున్న ఇబ్బందులు చెబితే పరిష్కారం చూపుతారు. కాబట్టి.. తెలంగాణలోని మారు మూల పల్లెలోని వృద్ధుల వరకూ సేవలు అందించేందుకు మీరు చేయాల్సిందల్లా.. ఈ సమాచారం వారికి అందించటమే. జస్ట్ 14567 టోల్‌ఫ్రీనెంబర్.