ఈటల రాజేందర్… ఉరఫ్ ఈటల. రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్దకంగా మారింది. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఈటల ఇప్పుడు కులం కార్డు ఒక్కటే దిక్కయినట్టుంది. బీసీలందరూ తన వెనుక ఉంటారని ఆశపడుతూ నిన్నటి వరకూ గులాబీ పార్టీపై బాణాలు ఎక్కుపెట్టిన రాజన్నకు రాబోయే రాజన్నరాజ్యంలో ఏమైనా చోటు దక్కుతుందేమో చూడాలి. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో మూసాయింపేట, దేవరంజయాల్ భూముల విచారణ అదికారికంగా వాయిదా పడినట్టుంది. కానీ యంత్రాంగం మాత్రం ఈటల చుట్టూ ఉన్న లొసుగులున్నంటినీ క్రోడీకరించి కోర్టుకు సబ్‌మిట్ చేసే పనిలో పడ్డారట. తెలంగాణ, ఏపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లలో ఒక సెంటిమెంట్ చక్కర్లు కొడతుంటుంది. అప్పట్లో ఏపీ అంటే.. ఉమ్మడిగా ఉన్నపుడు దేవాదాయ శాఖ పదవి చేపట్టడాన్ని సెంటిమెంట్‌గా బావించేవారు. ఆ తరువాత అది వ్యవసాయశాఖకు చేరింది. ఆ రెండు మంత్రి పదవులు చేపట్టిన వారికి తరువాత రాజకీయ భవిష్యత్ ఉండదనేది ఒక నమ్మకం.. 2014లో అది కాస్తా.. స్పీకర్ పదవిపై పోయింది. ఏపీలో స్పీకర్‌గా ఐదేళ్లు పనిచేసిన కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తెలంగాణలో మధుసూదనచారి రాజకీయ భవిత ముగిసింది. ఇప్పుడు వైద్యశాఖ అంటే అమ్మో అనేంత వరకూ చేరింది. అదెలా అంటారా.. తెలంగాణలో గత సర్కారులో వైద్యశాఖ చేపట్టిన రాజయ్య, ఆ తరువాత సి.లక్ష్మారెడ్డి పాపం.. పదవుల్లో ఉండగానే ఏవో ఆరోపణలతో చేతులెత్తేశారు. ఇప్పుడు మూడో సారి ఈటల రాజేందర్ ఏకంగా పదవి నుంచి చివరకు పార్టీ నుంచి కూడా బర్తరఫ్ కాబోతున్నారు. ఈ లెక్కన.. వైద్యశాఖ బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారిందట.