విశాఖపట్టణం.. ప్రశాంత సాగరతీరం. కుల మతాలకు అతీతంగా జీవనం సాగించే ప్రజలు. ఇటువంటి చోట విజయవాడ బ్లేడ్ బ్యాచ్ కక్షలు కార్పణ్యాలు రెచ్చగొట్టారంటోంది వైసీపీ. అడ్డగోలుగా వచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అలియాస్ మీసాల బాబు ఎన్నో కబ్జాలు చేశాడట. అంతేనా.. మద్యం దుకాణాల్లో సిండికేట్లు, చిట్‌ఫండ్స్‌తో జనాలకు కుచ్చుటోపి పెట్టి కోట్లు సంపాదించడట. అసలు వెలగపూడి ఎక్కడి వాడంటే.. విజయవాడలో దేవినేని మురళీ అనుచరుడు. ఇతగాడిని ఏలూరు రోడ్డులో వీసీడీ షాపు ఉండేది. అక్కడే అడ్డమైన కార్యకలాపాలు చేస్తూ ఉండేవాడట. పోలీసులు కేసులు.. దందాలు ఇవన్నీ ఇతడు పైసలు సంపాదించేందుకు చేసే వాడట. అదే సమయంలో అంటే 1988లో బెజవాడ బెబ్బులి అని అభిమానులు పిలుచుకునే వంగవీటి మోహనరంగా హత్య జరిగింది. ఈ కేసులో వెలగపూడి కూడా ఉన్నాడట. జైలు కేసులతో తిరగాడట . ఆ తరువాత విజయవాడలో ఉంటే.. తన ప్రాణాలు పోవటం ఖాయమనే భయంతో విశాఖ పట్టణం చేరి.. 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచే ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తూ కోట్లు కూడబెట్టాడట. దీనిపై వైసీపీ నేతలు సవాల్ విసిరారు. దీనిపై తాను సచ్చీలుడినంటూ సాయిబాబా భక్తుడుగా.. తాను సాయిబాబా దేవాలయం ఎదుట ప్రమాణం చేస్తానంటూ వెలగపూడి వీర ప్రగల్భాలు పలుకుతూ విజయసాయిరెడ్డికి సవాల్ విసిరాడు. దీనిపై ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రతిసవాల్ విసిరారు. తానే విశాఖలోని సాయిబాబా గుడి వద్దకువ వస్తున్నట్టు చెప్పారు. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ఉద్రిక్తతకు దారితీసింది. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం.. కట్టుదిట్టమైన భద్రత చేపట్టింది.