ఆనందయ్య… ఆయుర్వేదంతో ఒక్కసారిగా పాపులారిటీ సాధించారు. కరోనా మరణాలు… ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని టైమ్‌లో సంజీవనిగా భావించిన మందు. ఏపీ ప్రభుత్వం కూడా కొవిడ్ 19తో విమర్శలు ఎదురవుతున్నపుడు దిక్సూచిగా మారిందనే భావించారు. వేలాది మంది నెల్లూరు జిల్లా కృష్ణపట్నం దారిపట్టారు. ఆయుర్వేద మందుకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. శాస్త్రీయత లేదనే కారణంగా మందు తయారీ నిలిపివేశారు. వివాదంగా మారటంతో ఆనందయ్య ను ఇంటికే పరిమితం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆయుర్వేద పరిశోధనాలయం ప్రయోగాలు ప్రారంభించింది. దీనపై ఆనందయ్య హైకోర్టుకు వెళ్లటం అన్నీ జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆనందయ్య మందు తీసుకుని కోలుకున్నట్టు ప్రకటించిన రిటైర్డ్ హెడ్ మాస్టార్ కోటయ్య మళ్లీ అనారోగ్యం భారినపడ్డారు. కోలుకుని ఇల్లు చేరినా మళ్లీ ఊపిరి ఆడకపోవటంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ
మరణించాడు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది. ఇదంతా నిజమేనా. తెరవెనుక ఏవైనా శక్తులు డ్రామా నడిపించాయా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆనందయ్య వెంట ఉన్న వ్యక్తి, మరో 72 మందికి కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చినట్టు ప్రకటించారు. కృష్ణపట్నంలోనూ వైరస్ ప్రబలినట్టు వైద్యులు చెబుతున్నారు. ఇద్దరు పాజిటివ్ భారినపడ్డారని తేల్చారు. మరో 250 మంది నమూనాలు ల్యాబ్‌కు పంపారు.. ఆ రిపోర్టు వచ్చిన తరువాత అసలేమిటనేది తెలియాల్సి ఉంది.