భూవివాదాలు పోలీసులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. రైతుల నిస్సహాయత.. క్రిమినల్స్ దౌర్జన్యంతో అవి ఠాణాల వరకూ చేరుతున్నాయి. అక్కడ పైసలు చేతిలో పడనిదే న్యాయం జరగదు అనేంతగా కొందరు పోలీసులు వ్యవహరిస్తుంటారు. ఇలా రంగారెడ్డి జిల్లా షాబాద్ పరిధిలో ఓ పెద్దాయనకు కడుపు మండింది. అంతే.. ఏసీబీ అధికారులకు ఉప్పందించాడు. అవినీతికి కేరాఫ్ చిరునామాగా మారుతున్న వారిని కట్టడి చేసేందుకు తనవంతు సహకారం అందించాడు. షాబాద్ పోలీస్‌స్టేసన్ ఇన్‌స్పెక్టర్ శంకరయ్య, ఏఎస్సై రాజేందర్ ఇద్దరూ ఓ బాధితుడి నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆ ఠాణాలో సోదాలు చేపట్టారు. అవకాశాన్ని బట్టి ఇన్‌స్పెక్టర్ ఆస్తుల గురించి కూడా కూపీ లాగేందుకు అవకాశం ఉంది.