వివేకా హ‌త్య‌కు గుజ‌రాత్‌తో సంబంధం ఏమిటో?

నిజ‌మా… ఇదే బోడిగుండు.. మోకాలికి ముడి వేయ‌టం అనుకునేరు. ఇది నిజ్జంగా నిజం.. 2018 అంటే.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు క‌డ‌ప జిల్లా పులివెందుల గ‌డ్డ మీద అది కూడా.. వైఎస్ రాజశేఖ‌ర్‌రెడ్డి కుటుంబానికి కంచుకోట వంటి చోట‌.. సాక్షాత్తూ.. వైఎస్సార్ సోద‌రుడు వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణంగా హ‌త్య‌కు గుర‌య్యాడు. ఆ నాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న టీడీపీకు కాస్త వ‌ణ‌కు మొద‌లైంది. ఇదంతా కుటుంబ క‌క్ష‌ల‌తో జ‌రిగిన‌ట్టుగా అనిపించినా.. త‌మపై ఆరోప‌ణ‌లు రావ‌టంతో దీన్ని ఎలాగైనా వైసీపీ ఖాతాలోకి నెట్టేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. ఆ నాడు.. నిజాయ‌తీ గ‌ల అధికారులు త‌మ‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌లేదనే కోపంతో బ‌దిలీ కూడా చేశార‌నే గుస‌గుస‌లున్నాయి. అయితే.. ఇప్పుడు అంటే దాదాపు రెండున్న‌రేళ్ల త‌రువాత సీబీఐ విచార‌ణ వేగవంతం చేసింది.. వాచ్‌మెన్ ఇచ్చిన స‌మాచారంతో సునీల్‌యాద‌వ్‌ను అరెస్ట్ చేశారు. అయితే.. ఆ కుటుంబం మాత్రం.. మేమంతా అమాయ‌కుల‌మంటుంది. పైగా పోలీసుల వేధింపులు భ‌రించ‌లేక సూసైడ్ చేసుకునేందుకు గోవా వెళ్లామంటూ సెల‌విచ్చారు. సీబీఐ కూడా కేసును స‌వాల్‌గా తీసుకుంది. వీలైనంత త్వ‌రిత‌గ‌తిన కేసు ముగించాల‌నే వ్యూహంతో ముందుకెళుతుంది. సునీల్‌యాద‌వ్‌ను 10 రోజులు పోలీసు క‌స్ట‌డీ కోరుతూ న్యాయ‌స్థానంలో పిటీష‌న్ వేసింది. దీంతో క‌డ‌ప న్యాయ‌స్థానంలో నిందితుడిని సీబీఐ క‌స్ట‌డీకు ఇచ్చింది. అయితే..హ‌త్య‌కు కార‌ణాలు.. కుటుంబ క‌క్ష‌లా.. వివేకా వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార‌మా అనేది ప‌క్క‌న‌బెడితే.. వివేకా హ‌త్య‌కు ప్లాన్ జ‌రిగింది.. గుజ‌రాత్ అని తేలింది. అక్క‌డ నుంచే ప్రొఫెష‌న‌ల్ కిల్ల‌ర్లు.. చ‌క్రం తిప్పార‌ని తెలుస్తోంది. పాత్ర‌దారులుగా లోక‌ల్ వాళ్ల‌ను… వైఎస్ కుటుంబానికి స‌న్నిహితుల‌ను వాడుకున్న‌ట్టుగా పోలీసులు గ‌తంలోనే నిర్ద‌ర‌ణ‌కు వ‌చ్చారు. అయితే ఇంత‌లోనే టీడీపీ ప్ర‌తిప‌క్షంలోకి చేర‌టం.. వైసీపీ అధికారంలోకి రావ‌టంతో విష‌యం త‌ల‌కిందులైంది.. ఏమైనా ఈ కేసు ఇటు టీడీపీను ఎంత ఇరుకున పెట్టిందో.. అదే స‌మ‌యంలో అధికార వైసీపీ స‌ర్కారును కూడా ఇబ్బందికి గురిచేస్తుంద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here