సినీ హీరో రామ్‌గా యాక్టింగ్‌ను చాలా ఈజీగా చేయగలడు . కానీ ఎందుకో విజయవాడ ఫైర్ యాక్సిడెంట్ తరువాత రామ్ ఎందుకో కాస్త ఎమోషన్ అవుతున్నట్టున్నారు. విజయవాడలో జరిగిన స్వర్ణప్యాలెస్ సంఘటన బాగా కదిలించినట్టుంది. ఆ ఘటనలో 12 మంది కరోనాతో చికిత్స పొందుతున్న బాధితులు గురించి వదిలేసి…రమేష్ ఆసుపత్రి చుట్టూ ఏదో రాజకీయం జరుగుతుందంటూ ట్వీట్లు చేస్తున్నారు. పోన్లే.. పెద్దనాన్నకు ఏదైనా అయినపుడు స్వతహాగానే వారసులకు కోపం వస్తుంది. రామ్ కోపంలో వాస్తవం లేకపోలేదు. ఏపీలో కమ్మ సామాజికవర్గంపై కుట్ర జరుగుతుందనే టీడీపీ వాదనకూ అవకాశం లేకపోలేదు. అయినా.. ఘోరమైన ప్రమాదం.. పైగా పేషెంట్లను చేర్చుకున్న ఆసుపత్రిదే బాద్యత అనటంలో తప్పులేదు. కానీ.. కేసు గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో ఇలా బయటి వ్యక్తుల జోక్యంపై ఇప్పటికే రామ్‌కు ఏసీపీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. కేసును పక్కదారి పట్టించేలో రాతలు.. కూతలు ఉంటే నోటీసు జారీచేస్తామంటూ హెచ్చరించారు కూడా. దీంతో రామ్ కాస్త రూటుమార్చాడు.
కరోనాను మించిన వైరస్ కులమట. కులపిచ్చి అత్యంత ప్రమాదకరమట. కుల రక్కసి నుంచి మనల్ని మనమే కాపాడుకుందా మంటూ పిలుపు కూడా ఇచ్చారండోయ్. వావ్.. ఏం చెప్తిరి.. ఏం చెప్తిరి. అనిపిస్తుందంటూ సోషల్ మీడియాలో ఫుల్ సెటైర్లు కూడా మొదలయ్యాయి. 2005 నుంచి సినిమా రంగంలో ఉన్న రామ్ ఇప్పుడు కుల రక్కసి గురించి తెలుసుకున్నాడంటూ ఎద్దేవా చేస్తున్నారు. నిజమే.. ఇన్నాళ్లు.. మౌనంగా ఉన్న రామ్ ట్వీట్టర్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు. పెద్దనాన్న రమేష్ తరపున స్పందిస్తే ఓకే కానీ.. ఇలా ఏపీలో కులాలను రెచ్చగొట్టేలా ఇటువంటి ట్వీట్లు చేయకూడదంటున్నారు. న్యాయనిపుణులను సంప్రదించిన అనంతరం రామ్ ట్వీట్లపై పోలీసులు కూడా నోటీసులు జారీచేయటమా.. కేసు నమోదు చేయటమో.. ఏదోఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం.



