బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ రెండో కొడుకు ఫణీంధ్ర సతీమణి సుహారిక మే 29న ఉదయం అనునామాస్పద స్థితిలో మరణించారు. మాదాపూర్‌లో నివాసం ఉంటున్న ఫణీంధ్ర, సుహారిక దంపతులు.. మే 29న ఉదయాన్నే స్నేహితుడి ఇంట్లో పార్టీకు వెళ్లాల్సి ఉంది. ఫణీంధ్ర ఇంట్లోనే ఉండగా.. సుహారిక పార్టీకు వెళ్లారు. అక్కడ డ్యాన్స్ చేస్తూ కొద్దిసేపటికే సృహతప్పి పడిపోయింది సుహారిక. వెంటనే అక్కడున్న స్నేహితులు, సుహారిక తల్లి ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే ఆమె మరణించింది. తల్లి కూడా కూతురు మరణంపై ఎటువంటి అనుమానాలు లేవంటూ చెప్పింది. అయితే తాజాగా ఫణీంధ్ర.. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌కు లేఖరాశారు. భార్య మరణం గురించి ఆమె స్నేహితులు . తల్లి సాగరిక ఏవో నిజాలు దాస్తున్నారంటూ ఆరోపించారు. వాస్తవాలు వెలికితీసి న్యాయం చేయాలని సీపీను కోరారు.



