కన్నుపడితే.. నగలు మటాష్. గుడి కనిపిస్తే లూటీ చేస్తారు. దొంగలందు. దర్జాదొంగలు వేరన్నట్టుగా ఉంటుందీ ముఠా. నందిగామ చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను నందిగా సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముఠాను అరెస్ట్ చేసి లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ డీఎస్పీ మురళీ కృష్ణ వివరాలను విలేకర్లకు వెల్లడించారు. ఓరా లింగయ్య అనే వ్యక్తి శ్రీను, రాచకొండ వెంకన్న మరో ఇద్దరితో కలసి ముఠా తయారు చేశాడు. నందిగామ పోలీసు సబ్‌డివిజన్ పరిధిలో ఆరుచోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. గతేడాది నం దిగామ మండలం పెద్దవరంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో చోరీకు పాల్పడ్డారు. వత్సవాయి ఠాణా పరిధిలోని రామాలయంలో దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ఆ విగ్రహాలు ఖరీదైనవి కాదని తెలిసి నల్గొండ సమీపంలోని కృష్ణానదిలో పడేశారు. ఇలా… చందర్లపాడు, కంచికచర్లలో పలు చోట దొంగతనాలకు దిగారు. ఈ ముఠా నుంచి రూ. 1.76ల క్షల విలువైన ఆభరణాలు, నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నందిగామ డిఎస్పి రమణ మూర్తి, సీసీఎస్ డీఎస్పీ మురళి కృష్ణ, నందిగామ సీఐ కనకారావు , ఎస్ఐలు పాల్గొన్నారు.



