వీరశంకర్‌రెడ్డి.. మొక్కే కదా! అని పీకేస్తే పీక కోస్తా. ఇంద్రలో వేలు చూపుతూ మెగాస్టార్ పలికిన డైలాగ్‌లు సినిమా థియేటర్లను హోరెత్తించాయి. తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళ్తున్నా.. లేకపోతే తలతీసుకెళ్లేవాడినంటూ అన్నయ్య కన్నెర్ర చేస్తే క్లాప్స్ కొట్టి అభిమానుల చేతులు ఎరుపెక్కాయి. ప్రతి సినిమాలోనూ ప్రత్యేకమైన డైలాగ్.. మేనరిజమ్స్ చిరంజీవి సొంతం. పునాదిరాళ్లు సినిమా మొదటిది అనుకుంటారు. కానీ వాస్తవానికి చిరంజీవి తొలిచిత్రం మనవూరి పాండవులు.. ఐదుగురు హీరోల్లో ఒకరిగా మెప్పించారు. ఆ సినిమా సమయంలోనే దర్శకుడు బాపు కొణిదెల వారసుడిలోని ప్రత్యేకతను గుర్తించారట. కష్టపడేతత్వం కూడా ప్రత్యక్షంగా చూశారట. ఆ నాడే.. ఈ కుర్రోడు వెండితెరను ఏలేస్తాడన్నారట. ఆ కళ్లతోనే ఏదో మాయచేస్తారంటూ చెప్పారట.ఆ తరువాత అదే నిజమైంది.. కోట్లాది ఫ్యాన్స్ గుండెల్లో ఖైదీ అయ్యారు. 60 ఏళ్ల వయసులో సైరా అంటూ వస్తే.. రెడీ నరసింహారెడ్డి అంటూ ఇంటిల్లిపాదీ థియేటర్లకు కదిలారు. మూడు దశాబ్దాల క్రితం.. ఎవరైనా డ్యాన్స్ వేస్తే.. ఏరా నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా! అనేవారు. మీసకట్టుతో ఆనాటి ఆడపిల్లల కలల రాకుమారుడుగా మారా
రు.ఖైదీలో రగులుతుంది మొదలిపొద పాటలో సర్పాల సయ్యాటను కళ్లారా చూపారు. డ్యాన్స్‌లంటే ఇలా చేయాలంటూ.. లంకేశ్వరుడులో పదహారేళ్ల వయసు అంటూ తెలుగు సినిమా డ్యాన్స్‌ను మార్చేశారు. ఇంద్రలో వీణస్టెప్పు.. హిట్లర్‌లో హబీబీ.. ఏం చెప్పాలి.. ఎలా చెప్పాలి. గాన గంధర్వుడు బాల
సుబ్రహ్మణ్యం నా పాటకు న్యాయంచేసిన నటులు ఇద్దరే ఒకరు ఎన్టీఆర్, మరొకరు చిరంజీవి అంటూ గర్వంగా చెప్పేవారు.
డ్యాన్స్‌ల్లో ప్రభుదేవా కూడా నాకు స్పూర్తి మెగాస్టార్ అంటారు. సుందరం మాస్టారు చిరు స్టెప్పు
ల గురించి చెప్పాలంటే పొంగిపోతారు. ఈ నాటి శేఖర్‌మాస్టారు, జానీ వంటి కొరియోగ్రాఫర్లు కూడా కేవలం చిరంజీవి డ్యాన్స్‌లు చూసి తాము డ్యాన్స్ మాస్టర్‌లుగా కెరీర్ ఎంచుకున్నామంటారు. కాబట్టే.. 65 ఏళ్లకు చేరువైనా.. ఖైదీనెంబరు150లో అమ్మడూ.. లెట్స్‌డూ కుమ్ముడూ అంటే.. అబ్బే అన్నయ్యకు జస్ట్ 25 అనుకుంటూ అభిమానులు మురిసిపోయారు. ఇంత అభిమానం గుండెల్లో దాచుకున్న ఫ్యాన్స్ అగస్టు 22కు ముందే చాలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
మాజీ కేంద్రమంత్రివర్యులు, పద్మవిభూషణ్, డా:శ్రీ మెగాస్టార్ చిరంజీవి 65వ జన్మదినం సంధర్భంగా వారియెక్క జీవిత చరిత్ర లెజెండ్ పుస్తకావిష్కరణ చేసినట్టు తిక్కిరెడ్డి విష్ణుమూర్తి తెలిపారు.చిరంజీవి గారి 65 సం. జన్మదిన వారోత్సవాలలో భాగంగా నాలుగో రోజు కృష్ణాజిల్లా మాగల్లు లో ఖాసి & ఖాసిం వృద్ధ ఆశ్రమం లో చిరంజీవి నందిగామ యువత వారికి ఒక రోజుకి సరిపడా నిత్యావసర వస్తువులు అందించారు. మంచి మనసు తో చేసే పని నలుగురికి మంచే చేకూరుస్తుంది అని సేవా కార్యక్రమం లోనైన ఆపదలో ఉన్న వారికి సహాయం అయినా… చిరంజీవి యువత నాయకులు ముందే ఉంటారు అని తెలియజేస్తూ.. ఈ కార్యక్రమంలో పశ్చిమ కృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ కమిశెట్టీ వేంకటేశ్వరరావు నందిగామ నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడు రామిరెడ్డి వీరబాబు నందిగామ చిరంజీవి యువత అధికార ప్రతినిధి పోలిశెట్టి కోటేశ్వరరావు , చిరంజీవి యువత నందిగామ ఉపా అధ్యక్షుడు హనుమంతురావు, తాటి రాఘవరావు , కంచి వెంకట్రావు , తాటి నరేంద్ర య మరియు మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.