కరోనా విద్యార్థులు.. ఉద్యోగం కోసం వెతికే కోట్లాది మంది యువత ఆశలకు గండికొట్టింది. విదేశీ చదువులను దూరం చేసింది. ఇటువంటి సమయంలో ప్రతిష్ఠాత్మక సంస్థ గూగుల్ అద్భుతమైన అవకాశం అందిస్తుంది. ఒకరకంగా ఇది నిరుద్యోగులు, ఉద్యోగం కోసం వెతికేవారికి బహుమతిగా భావించవచ్చు. దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించిన వివరించటం, వాటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలనే అంశాలను తెలుగుసుకునేందుకు గూగుల్ అధ్భుతమైన ప్లాట్ ఫామ్ అందించింది. అదే..
కోర్మోజాబ్స్ పేరిట ఆండ్రాయిడ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయనుంది. అయితే దీన్ని మొదటిసారి 2018లో బంగ్లాదేశ్‌లో విజయవంతంగా అమలు చేశారు. 2019లో ఇండోనేషియాకు విస్తరించిది. కార్మోజాబ్స్ పేరిట యాప్ ద్వారా యువతీ, యువకులకు సమాచారం.. వీలైనంత సాయం చేసేందుకు చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. అదేబాటలో గూగుల్ కూడా గొప్ప ప్రయత్నం చేయటం శుభసూచకం.