అది పక్కా ప్లానింగ్. ఏ మాత్రం అనుమానం రాకుండా చాకచక్యంగా వేసిన ఎత్తుగడ. ఒకటి రెండ్రోజులు కాదు.. వారం పదిరోజుల పాటు స్కెచ్ గీసి చేసిన హత్యలు. వరంగల్ నగర శివారు పాడుబడిన బావిలో తొమ్మిది మృతదేహాలు సంచలనం రేకెత్తించాయి. ఇంతమంది ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారా! ఎవరైనా చంపి పడేశారా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆరు పోలీసు బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశారు. బిహార్, పశ్చిమబెంగాల్, తెలంగాణ మూడు రాష్ట్రాలకు చెందిన వీరందరి మరణం మిస్టరీగా మారింది. ఇదంతా వివాహేతర సంబంధం కారణంగా జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గన్నె సంచుల తయారు చేసే చోట మూడు కుటుంబాలుంటున్నాయి. ముక్సూద్ అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమారులు, భర్తను వదలి వచ్చిన కూతురు, మనుమరాలితో కిందపోర్షన్‌లో ఉంటున్నారు. పై భాగంగా బిహార్‌కు చెందిన ఇద్దకు యువకులు ఉంటున్నారు. ముక్సూద్ కూతురుతో నగరంలోని ఓ వ్యక్తితో అనైతిక బంధం ఏర్పడింది. దీనిపై తల్లీకూతుళ్లు నిత్యం పోట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బిహార్‌కు చెందిన కుర్రాళ్లు కూడా ఆమెపై కన్నేశారు. ఇది గమనించిన ప్రియుడు.. నమ్మకంగా వీరందరినీ ఒకేచోటకు రప్పించేలా పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ రోజు అందరూ ఆనందంగా గడిపారు. ఆ తరువాత తొమ్మిది మృతదేహాలు బావిలో బయటపడ్డాయి. వివాహేతర సంబంధం కారణంగా చోటుచేసుకున్న ఘటన వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోరెన్సిక్ నివేదికలో అందరూ నీటిలో మునిగి మరణించారని భావించారు. కానీ.. ఇద్దరు మాత్రం విష ప్రయోగంతో మరణించినట్టు అంచనా వేశారు. వివాహేతర సంబంధం కారణంగానే ఇదంతా జరిగిందని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ వెలుగుచూడని మరో వ్యక్తిపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నేరం నుంచి తాను తప్పించుకునేందకు వేసిన పథకం పారిందని భావించి అతడు.. చేసిన చిన్నపొరపాటు పోలీసులకు ఆధారంగా మారింది. అసలు నిందితుడు.. కీలక సూత్రదారి ఎవరనేది తెలిసేందుకు మరో రెండుమూడ్రోజులు పడుతుందంటున్నారు పోలీసు అధికారులు.



