బీమా… బోలెడంత ధీమా!

క‌ష్టం.. అవ‌స‌రం. ఏ వైపు నుంచి ఎలా వ‌స్తుందో చెప్ప‌టం క‌ష్ట‌మే. పైసా విలువ క్ర‌మంగా త‌గ్గుతోంది. అవ‌స‌రాలు విప‌రీతంగా పెరుగుతున్నాయి. చాలీచాల‌ని సంపాద‌న‌తో కుటుంబాన్ని నెగ్గుకురావ‌ట‌మ గ‌గ‌నంగా మారుతోంది. ముఖ్యంగా.. పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాల‌కు పొదుపు చేయ‌టాన్ని పేద్ద‌క‌ష్టంగా లెక్క‌లు క‌డుతుంటారు. కానీ.. వ‌చ్చే సంపాద‌న‌తో కాస్త పొదుపు చేయ‌టం.. రేప‌టి అవ‌స‌రాల‌కు దాచుకోవ‌టం అల‌వాటుగా మార్చుకుంటే అదే భ‌విష్య‌త్‌కు భ‌రోసాగా నిలుస్తుంది. తాను ఉన్నా లేక‌పోయినా.. త‌న వారికి ఢోకాలేద‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తుంది.. అదే జీవిత‌బీమా.. పొదుపు. రేప‌టి అవ‌స‌రాలకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌రొక‌టి ఆరోగ్య‌బీమా(హెల్త్ ఇన్సూరెన్స్‌) మారిన జీవ‌న‌శైలి.. క‌ల్తీతిండి.. కాలుష్యం ఏ క్ష‌ణంలో ఏ రుగ్మ‌త‌ను ద‌గ్గ‌ర చేస్తుందో అనేది అంచ‌నా వేయ‌టం క‌ష్టం. ఆసుప‌త్రి గుమ్మం ఎక్కితే వేలు చేతిలో ఉండాలి. ఆసుప‌త్రిలో చేరాలంటే ల‌క్ష‌లు త‌ప్ప‌నిస‌రి. ఇటువంటి స‌మ‌యంలో కాస్త సొమ్ముతో ఆరోగ్య‌బీమా చేయించుకుంటే అదే ఆప‌ద‌వేళ శ్రీరామ‌ర‌క్షగా కాపాడుతుంది.

అభివృద్ధి చెందిన దేశాలలో ఇన్సూరెన్స్ కూడా .. దీనిని తప్పనిసరిగా భావిస్తారు. మ్యారేజ్ బయోడేటా లో కూడా ఇన్సూరెన్స్ ప్రిమియం పాలసీ నెంబర్ రాయవలసి ఉంది. కానీ ఇండియాలో అంత అవగాహన లేదు. గుడిలోకి వెలితే చెప్పులకు 5రూపాయలు కడతాము బైక్, సెల్, కారు వీటికి కూడా ఇన్సూరెన్స్ కడతాము. కానీ మనిషికి ఇన్సూరెన్స్ చేయటానికి అలోచిస్తాము. ఇన్సూరెన్స్ బాండ్ అనేది ఫ్యామిలీ కి ఇచ్చే లవ్ లెటర్ లాంటిది. ఇండియాలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి శర్మనికి వచ్చి చెప్పకుండా తిరిగి వెళ్ళాలనే విధానం.. నాకు తెలిసిన ఉదాహరణ ,చనిపోయిన అమ్మాయి తన బాధలు, తన అవసరాలు చెపుతుంది అనే భయం తో ఆ విధానం వచ్చిందని నా యొక్క ఉద్దేశం .. ఆ టైమ్ లో అమె అవసరాలను బాధలను ఈ పాలసీ తీరుస్తుంది. పాలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి పెరుగు, మజ్జిగ, వెన్న, స్వీట్ ఇంట్లో పాలు ఉంటే ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో పాలసీ కూడా అన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు 2 సంవత్సరాలు ప్రిమియం తరువాత అవసరమైతే లోన్ తీసుకోవచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపు వస్తుంది అంగవైకల్యం లాంటి ప్రమాదాలు జరిగితే పాలసీ లో రైడ్స్ పెట్టుకుంటే కుటుంబ అవసరాలకు ఎంతగానో అవసరపడుతుంది. కుటుంబ యజమాని అనుకోని పరిస్థితుల్లో చనిపోతే కుటుంబానికి ఎల్ఐసి ఎంతో ఆసరాగా ఉంటుంది. పిల్లల చదువు కోసం , వాళ్ళ ఆశలు, ఆశయాలు నేరవేరడం కోసం ఎల్ఐసి పాలసీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఎల్ఐసి మనం కట్టే ప్రతి ఒక్క రూపాయికి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది సెక్షన్ – 37 /1/2 ఎల్ఐసి 1956 యాక్టివ్ ప్రకారం సెంట్రల్ గౌర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది.

ఆరోగ్య భీమా గురించి అవగాహన లేదు. చాలా మందికి దీని అవసరం , ఉపయోగం తెలియవలసి ఉన్నది. మనం అనుకోకుండా ఆసుపత్రికి తెలవకుండా వెళ్లవలసి వస్తే ప్రమాదం లో గాని అనుకోని అనారోగ్యం వల్ల గాని ఇల్లు కట్టుకుందాం అని పిల్ల పెళ్ళి చేద్దాం అనో ఒక అపార్ట్ మెంట్ కొందమనో దాచిన డబ్బులు ఆసుపత్రి బిల్ కి ఖర్చు అవుతుంది అప్పుడు ఆ ఫ్యామిలీ ఆర్ధికంగా మానసికంగా కృంగిపోతుంది. బండికి బ్రేక్ లు ఎంత అవసరమో డ్రైవింగ్ చేసే వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ ఎంత అవసరమో ఆరోగ్యం గా ఉన్న వ్యక్తికి ఆరోగ్య భీమా అంత అవసరం. ప్రమాదం లో గాని అనుకోని అనారోగ్యం వల్ల మనం రోజు వారి నెలవారీ పెట్టే ఖర్చులతో పోల్చుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రిమియం చాలా తక్కువ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లో చాలా మంది స్నేహితులు ఉంటారు కానీ మనం ఒక లక్ష రూపాయలు కావాలని మేసేజ్ పంపితే వాళ్ళు స్పందిస్తారో లేదో తెలవదు స్పందించిన వాళ్ళు అందుబాటులో ఉంటారో లేదో కూడా తెలవదు అలాంటి పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. అలానే ఏజెంట్ చెప్పడనో మనవాడు అనో చేయడం కాకుండా మన కోసం చేసుకోవాలి సర్వీస్ చేసే ఫుల్ టైమ్ ఏజెంట్ దగ్గర మాత్రమే ఏ ఇన్సూరెన్స్ అయినా చేయాలి. మనం ఏ దేశం వెళ్ళాలన్నా హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఎవరు ఏ దేశానికి రాని పరిస్థితి ఉంది అలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ అందరూ తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనారోగ్యం వచ్చి తీసుకునే కంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకోవడం ఎక్కువగా ఉపయోగపడుతుంది. భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా దర్బార్ బత్తిలా కంపెనీ కి కస్టమర్ కి అనుసంధానం ఏజెంట్. ఏజెంట్ ని కూడా తన కోసం వచ్చడనో, తన వృత్తి కోసం వచ్చడనో అనుకోకుండా ఏజెంట్ ఇంపార్టెన్స్ కూడా తెలుసు కొని ప్రవర్తించాలి. మన వృద్ధాప్యంలో మన పిల్లల్ని డబ్బులు అడగాలని అలోచిస్తారు ఫిల్ అవుతారు ఒకరిమీద ఆధారపడకుండా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వలు స్వచ్ఛంద్ర సంస్థలు ప్రచారం చేసి ప్రజలలో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ చేపించి ప్రతి ఒక్కరి కుటుంబానికి ఆరోగ్య భీమా ఉండే విధంగా దోహదపడాలి.

రామిరెడ్డి.శ్రీధర్, 
ఇన్సూరెన్స్ అడ్వైజర్

2 COMMENTS

  1. చాలా బాగుంది. ఒకరు చనిపోయినప్పుడు చెప్పకుండా వెళ్లడం ఆనవాయితీ..ఎందుకంటే అందరూ వెళ్తున్నామని చెప్పటానికి వెళితే ఆ కుటుంబం బాధలో ఉన్నపుడు అందరూ వదిలి వెళ్తున్నారని అధైర్యపడకుండా ఉండటానికి అలా చెప్పాలి తప్ప డబ్బులు అడుగుతుంది అని కాదు…

  2. చాలా బాగుంది ఆర్టికల్
    ఒకరు చనిపోయినప్పుడు చెప్పకుండా వెళ్లడం ఆనవాయితీ..ఎందుకంటే అందరూ వెళ్తున్నామని చెప్పటానికి వెళితే ఆ కుటుంబం బాధలో ఉన్నపుడు అందరూ వదిలి వెళ్తున్నారని అధైర్యపడకుండా ఉండటానికి అలా చెప్పాలి తప్ప డబ్బులు అడుగుతుంది అని కాదు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here