మెగా ఫ్యాన్స్‌కు అగస్టు 22న పండుగ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరు అభిమానులు ఇప్పటికే వారోత్సవాలు ప్రారంభించారు. వివిధ సేవా కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. పేదలకు సాయం చేయటం, అన్నదానం, రక్తదానం, మొక్కల పంపిణీ వంటి వినూత్న కార్యక్రమాలతో సేవకు కొత్త అర్ధం చెబుతున్నారు. పశ్చిమకృష్ణ చిరంజీవి యువత అధ్యక్షుడు తోట మురళీ కృష్ణ సారథ్యంలో అభిమానులు తాటి రాఘవరావు, కంచి వెంకట్రావు తదితరులు మొక్కలు పంపిణీ చేశారు.