ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా! విశాఖకు తరలిస్తారా! వేలాదిఎకరాలు భూములిచ్చిన రైతులను కలవరపెడుతున్న అంశం. అప్పటి విపక్ష నేతగా జగన్ మోహన్‌రెడ్డి అమరావతికి జై కొట్టి అధికారంలోకి రాగానే ఎందుకిలా అకస్మాత్తుగా మూడు రాజధానులు తెరమీదకు తెచ్చారనేది కేవలం కులపరమైన కారణమనే భావన లేకపోలేదు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక తరువాత దానిలో ఏముందనే విషయాన్ని బయటకు వెల్లడించకుండానే విజయవాడ దగ్గరలోనే రాజధాని అనుకున్నది గుంటూరు జిల్లా తుళ్లూరు తరలించారు. బెజవాడకు సుమారు 25 కి.మీ దూరంలోని ఈ ప్రాంతం మూడు పంటలతో పచ్చతోరణంగా కనిపించే సుందరమైన తీరం. వ్యవసాయానికి అసలు సిసలు చిరునామా.
అటువంటి పల్లెల్లో రాజధాని అనగానే గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు సంబరపడిపోయారు. ప్రభుత్వం కూడా ల్యాండ్ పూలింగ్ పద్దతి లో భూములను సేకరించి ప్రపంచం లో నే అత్యద్భుతమైన గ్రీన్ఫిల్డ్ రాజధాని నిర్మించాలి అని ప్రయత్నం మొదలుపెట్టారు. భూములని సేకరించేటపుడు చాల పెద్ద తతంగమే జరిగింది. ఈ రోజు తెలుగు దేశం పార్టీ నాయకులు స్వచ్చందం గ భూములు ఇచ్చారనే అంశం సత్య దూరమనే చెప్పాలి. కొంతమంది ప్రవాసాంధ్రులు టీడీపీసానుభూతిపరులు వారికీ భూములు లేకపోయినా ఆ ప్రాంత రైతుల నుండి భూములను కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఇచ్చారంటూ తాజాగా ఏపీ ప్రబుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సాక్ష్యాలతో సహ నిరూపించారు.
ఆ ప్రాంతంలోని దళితుల అసైన్డ్ భూములను అధికారపార్టీ నాయకులు కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. దీనిపై ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది కూడా.
ఈ వ్యవహారంలో నాటి మంత్రుల ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న కొందరు రైతులు భూములిచ్చి తామేం చేయాలంటూ ఎదురుతిరిగారు. ఇలాంటి వారిని లొంగ తీసుకోవటనికి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కానీ బయట వ్యక్తులు కానీ వారిని బెదిరించటం, పొలాల్లో లో పంటను తగలపెట్టడం, పోలీసులు చేత అక్రమ కేసులు బనాయించటం వంటి ఘటనలు చాలా జరిగాయి. దీనికి కారణాలు ఇప్పటికీ అంతుబట్టని ప్రశ్నలుగానే మిగిలాయి.
ఈ ప్రక్రియ లో భాగంగా భూములు ఇవ్వటానికి నిరాకరించిన రైతుల పై ప్రభత్వం భూసమీకరణ చట్టాన్ని ప్రయోగించింది. అప్పట్లో రైతులకి అండగా మంగళగిరి మ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రైతుల తరుఫున కోర్టులో కేసులు వేయించి వాళ్ళకి రక్షణ కల్పించటం కొసమెరుపు. అనంతరం ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల రైతులు తమకు అండగా ఉండాలంటూ జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కోరారు. ఈ నేపథ్యంలో ఆయన రాజధాని గ్రామంలో పర్యటించి రైతులు ఇష్టపడి ఇస్తే భూములు తీసుకోండి బలవంతపు భూసేకరణ చేస్తే రైతుల తరఫున ఉద్యమించటానికి సిద్దంగా ఉన్నాను అని ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం భూసమీకరణ నోటిఫికేషను ఉపసంహరించుకుంది.
ఎంతో ఆర్భాటంగా రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రిని అతిధులుగ పిలవటం జరిగింది. ఐతే ప్రతిపక్ష నాయకుడు వై.స్.జగన్ ను తెలుగు దేశం ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యకారకుడైన పవన్కళ్యాణ్ ను మొక్కుబడి తంతుగా ఆహ్వానించడం వారుకూడా ఆ కార్యక్రమానికి హాజరు కాలేదనేది ఆ పార్టీ వర్గాల అభిప్రాయం. ముఖ్య అతిథిగా వచ్చిన ప్రధాని మోడీ నుండి రాజధాని నిర్మాణానికి ఆర్థికపరమైన సహాయం అందిస్తామనే ప్రకటనను ఆశించారు కానీ అదేమీ జరగలేదు. పవిత్రమైన మట్టి చెంబుడు నీళ్లు అందించటం ఇప్పటికి టీడీపీవారు బీజేపీ పైన విమర్శలు చేయటానికి అవకాశాన్ని ఇచ్చింది.
చంద్రబాబు సీఎంగా ఉన్న 5 సంవత్స్రములు అనేక అవస్థలు పడ్డ రైతులు 2019 సంవత్సరంలో జగన్ సీఎం అయ్యాక రాజధాని రైతుల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టు అయింది. సీఎం మూడు రాజధానుల ప్రకటన రావటం తో రైతులు తీవ్ర ఆందోళన కు గురి అయ్యారు. సంవత్సరానికి మూడు పంటలు పండే పొలాలు అటు పనటలు పండక ఇటు రాజధాని తరలిపోయి రైతులు రెండిటికి చెడ్డ రేవడిగా మిగిలిపోయారు. రోజుల తరబడి ఆందోళన చేస్తున్నారు. న్యాయపోరాటానికి దిగారు.
అమరావతి రాజధాని విషయం లో సీఎం జగన్ కు ప్రధానంగా రెండు అభ్యంతరాలు ఉన్నాయి ఒకటి అమరావతి రాజధానిగా కొనసాగితే చంద్రబాబుకి పేరు వస్తది కాబట్టే రాజధాని తరలింపే దేనికి పరిష్కార మార్గంగా ఆయన భావించారు రెండు అమరావతి చుట్టు పక్కల ఆ 29 గ్రామాలలో నే కాకుండా గుంటూరు, కృష్ణ జిల్లాలో చంద్రబాబు సామాజిక వర్గం చాల బలంగా ఉంది. ఇక్కడ రాజధాని వస్తే ఆ సామాజికవర్గం మరింత బలోపేతం అవుతుంది కాబట్టి ఆయనికి ఇక్కడ రాజధాని నిర్మించడం ఇష్టం లేదనేది టీడీపీ వాదన.
రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల నుండి వ్యతిరేకత రాకుండా వుండటంకోసం మూడు రాజధానులు అని ప్రకటించారు. వాస్తవం ఏమిటి అంటే విశాఖపట్నమే రాష్ట్ర రాజధాని. హైకోర్టు వేరే ప్రాంతంలో పెట్టిన ఆహ్ ప్రాంతాన్ని రాజధానిగ గుర్తించలేము.అసెంబ్లీ సమావేశాలు జరిగిన మాత్రాన ఆ ప్రాంతాన్ని రాజధానిగ గుర్తించటం కష్టం మంత్రులు,సీఎం ,గవర్నర్,సెక్రెటేరియేట్ అక్కడ ఉంటె అదే రాజధాని అవుతుంది. నేరుగా విశాఖపట్నం రాజధాని తరలింపు అంటే ప్రజలనుండి వ్యతిరేకత వస్తుంది అనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో 3 రాజధానుల అంశాన్ని తెరెపైకి తెచ్చారు.
Fact file analysis