చెరుకా.. చెరుకా.. బెల్లం పెట్టవే అంటే వస్తుందా! అబ్బే రాదు.. దాన్ని బాగా రఫ్పాడించి పిండి.. సలసల కాగేలావేడిచేస్తేనే బెల్లం వస్తుంది. అన్నమయ్య సినిమాలో మోహనబాబు డైలాగ్. నిజమే.. కరడుగట్టిన నిందుతుడి నుంచి పిక్‌పాకెటర్ వరకూ నిజం రాబట్టేందుకు ఖాకీ మార్క్ ప్రయోగం ఒకటుంది. కానీ.. దాన్ని ఎప్పుడు ఎవరిపై ప్రయోగించాలనేది ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఆధారపడి ఉంటాయన్నమాట. విజయవాడలో స్వర్ణప్యాలెస్ అనే హాస్పిటల్‌లో కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేయటమే పేద్ద తప్పు. పైగా దాన్ని మేమే లీజుకు తీసుకున్నామంటూ రమేష్ హాస్పిటల్ యాజమాన్యం బహిరంగంగా అంగీకరించటమూ కొసమెరుపే. మీడియా ముందు మాట్లాడిన రమేష్ అనే ప్రధాన నిందితుడు ఆ మరుసటిరోజే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదేమీ కొత్త కాదు.. ఏదైనా నేరం జరిగినపుడు.. అందులో పెద్దలు.. సంపన్నులు.. ప్రముఖుల హస్తం ఉందని తెలియగానే వారంతా భలేగా పారిపోతారు. పోనీ వారెక్కడ ఉన్నారో పోలీసులు పసిగట్టలేరా! అంటే.. అమ్మా.. పోలీసులను తక్కువ అంచనా వేస్తారా! ఎన్ని నేరాలు చేసినా నిందితుడు ఎక్కడో చిన్న క్లూ వదులుతాడు. దాన్ని పట్టుకుని పోలీసులు ఇట్టే కలుగులో ఉన్న వాడిని పట్టుకుని కోర్టుకు తరలిస్తారు. ఆ తరువాత పోలీసుకస్టడీకు తీసుకుని అసలే కక్కిస్తారు. మరి రమేష్ ఆసుపత్రి వ్యవహారంలో రమేష్, స్వర్ణప్యాలెస్ యజమాని.. కుటుంబంతో సహా రాత్రికి రాత్రే పారిపోయారు. పరారీలో ఉన్నవారికి కోసం దాదాపు పోలీసు బలగాలు గాలిస్తున్నాయట. దీనిపై వైసీపీ శ్రేణులు కూడా సామాజిక మాధ్యమాల్లో ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నాయి. పార్టీ కార్యాలయాల్లో వెతకమని ఒకరు.? స‌్వర్ణప్యాలెస్‌లో వెతకమని ఇంకొకరు ఇలా సెటైర్లు వేస్తూనే ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా.. జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం.. ఇటువంటి ఘటనల విషయంలో సీరియస్‌గానే ఉంది. పక్కా సమాచారంతో ఈ రోజో.. రేపో.. తప్పకుండా 11 మంది ప్రాణాలను బలితీసుకున్న కార్పోరేట్ నేరస్తులను పట్టుకుంటుందనే ధీమా ఏపీ ప్రజల్లో వుండటం కొసమెరుపు.