ఎవరి పిచ్చి వారికి ఆనందం.. ఎర్రచందనం.. బౌగోళికంగా కేవలం రాయలసీమ జిల్లాలో మాత్రమే దొరికేది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అంతగా డిమాండ్ ఉంది. చైనా, మలేషియా, జపాన్, సింగపూర్ తదితర దేశాల్లో రెడ్‌శ్యాండిల్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. లైంగికశక్తి పెంచేందుకు.. చైనాలో దీన్ని విరివిగా వాడుతున్నారు. జపాన్‌లో ఎర్రచందనం బొమ్మ ఇంట్లో ఉంటే చాలు బోలెడు లక్ అనే భావన ఉంది. ఇదంతా నిజమేనా మూఢనమ్మకమా అనేది పక్కనబెడితే.. ఎర్రచందనం మాత్రం కోట్లు కురిపిస్తుంది. రాజకీయనాయకులు, పోలీసు, అటవీశాఖ అధికారులు, సినీ తారలు కడా స్మగ్లర్లుగా చక్రం తిప్పుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో పట్టుబడిన ఎర్రచందనం చైనాకు తరలించాలనే యోచనలో ఉన్నారట. దొడ్డిదారిన తరలిస్తుండగా పోలీసులు చాలా చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నార.
చిత్తూరు జిల్లా తెలుగు పిచ్చాటూరు సమీపంలోని అప్పంబెడు వద్ద లారీలో రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న 227 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంకటయ్య తెలిపారు. ఎర్రచందనం దుంగలు రవాణా చేస్తున్న టి ఎన్ 61 ఎఫ్ 5578 లారీని సీజ్ చేసినట్లు డీఎస్పీ వెంకటయ్య తెలిపారు. స్మగ్లర్లు తెలివిగా రవాణా వాయిదా వేస్తూ వచ్చారని తెలిపారు. అయితే శనివారం తెల్లవారుజామున రవాణా చేస్తుండగా, తమ బృందం లారీని అడ్డుకున్నారని చెప్పారు. లారీ డ్రైవర్ ను పట్టుకోగలిగామని, అతనిని విచారించి, స్మగ్లింగ్ కు అసలు కారకులపై ఆరా తీస్తున్నామని తెలిపారు. ఊత్తుకోట ప్రాంతాల్లో స్మగ్లర్లు కోసం గాలింపులు చేస్తున్నట్లు చెప్పారు. మరికొన్ని దుంగలు కూడా అడవిలో ఉండవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. వీటిని కొంతమంది స్థానిక స్మగ్లర్లు, తమిళులు కలసి సేకరించి నట్లు తేలిసిందన్నారు.