బాబు ఎత్తు విక‌టించెన్‌.. మూడు రాజ‌ధానులు వ‌చ్చెన్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌ధాని ఏది? అంటూ పోటీప‌రీక్ష‌ల్లో ప్ర‌శ్న వ‌స్తే ఏమ‌ని జ‌వాబు రాయాలి? విశాఖ అంటే త‌ప్పు. కాదంటే ప్ర‌భుత్వానికి కోపం వ‌స్తుంది. కాబ‌ట్టి అభ్య‌ర్థులు బిక్క‌ముఖం వేయాల్సిందే. ఇది నిజంగానే చారిత్ర‌క త‌ప్పిదం. ఈ పాపంలో చంద్ర‌బాబు పాత్ర సుస్ప‌ష్టం. చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి ఏమిచ్చింది? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్ర బాబు ఈ రాష్ట్రాన్ని క్లిష్ట సమయాలలో కాపాడ‌టంలో విఫ‌ల‌మ‌య్యారు. ప్ర‌తి అంశాన్ని రాజ‌కీయాల‌తో ముడిపెట్టే బాబు లెక్క త‌ప్పింది. రాష్ట్ర విభజన సమయం లో రెండు కళ్ళ సిద్దాంతం తో నిస్స‌హాయంగా మిగిలారు. కనీసం విభాజిత అంధ్రప్రదేశ్ కు కావాల్సిన వాటిని చర్చకు తీసుకురావాల్సిన అవసరం గుర్తించ లేక పోయారు. నాడు కేంద్రంలో మంత్రిగా ఉన్న చిరంజీవి హైదరాబాద్ ను యూనియన్ టెర్రిటరి చేసి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేయాలనే ప్రతిపాదన చేస్తే దానికి మద్దతు ఇచ్చే సాహ‌సం చేయ‌లేక‌పోయారు. ఫ‌లితంగా ద‌శాబ్దాల పాటు శ్ర‌మ ప‌రుల‌పాలైన‌ట్ట‌యింది. రాష్ట్రం విడిపోయాక పవన్ కళ్యాణ్ బీజేపీ మద్దతు తో అధికారంలోకి వ‌చ్చిన బాబు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించారు. ఏపీ ప్ర‌త్యేక‌హోదా, ప్ర‌త్యేక ప్యాకేజీ రెండింటిలో దేనికి మ‌ద్దతు చెప్పాల‌నే అంశంపై స్ప‌ష్ట‌త‌కు రాలేక‌పోయారు. ప్ర‌త్యేక ప్యాకేజీ పాచిపోయ‌న ల‌డ్లుగా ప‌వ‌న్ వ‌ర్ణిస్తే త‌ప్పుబట్టారు. రాజధాని విషయం అన్ని పార్టీ ల తో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యారు. అంతే కాకుండా తాత్కాలిక భవనాలు నిర్మిస్తున్నామని చెప్పడం కూడా మూడు రాజ‌ధానుల పుట్టుక‌కు బీజం వేసింద‌నే చెప్పాలి. కేంద్ర సహకారం తీసుకునేటప్పుడు రాజకీయంగా వారికి లబ్ధి చేకురకుండ చేయాలనే ఉద్దేశతోనే వారిపై విరోధం తెచ్చుకున్నారు ప్రత్యేక హోదా విషయం లో ఒక స్టాండ్ కు పరిమితం కాకుండా రెండు వాదనలు వినిపించారు అది కూడా ఆయనకున్న క్రెడిబులిటినీ ని దెబ్బతీసింది. ఇవన్నీ కలిసి ఈ రోజు ఆయన కనీసం ప్రతి పక్ష నాయకుడు పాత్రను పోషించడానికి కూడా అడ్డు పడుతున్నాయనే భావ‌న ప్ర‌జ‌ల్లోనూ బాగా బ‌ల‌ప‌డింది. ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం రూపుదిద్దుకున్న తెలుగుదేశం పార్టీ భవిషత్తు ప్రశ్నార్థకం గానే మారింది.

 – తాటి రామ‌కృష్ణారావు, అధ్యాప‌కులు, సామాజిక‌-రాజ‌కీయ విశ్లేష‌కులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here