నిన్న కృష్ణాజిల్లాలో బీజేపీ నాయకుడు మద్యం తరలిస్తూ పట్టుబడ్డాడు. తాజాగా చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ నేతకు చెందిన కంటైనర్‌లో ఆవుమాంసం తరలిస్తూ ఇద్దరు చిక్కారు. ఒక డెయిరీకు చెందిన పాల వ్యాన్‌లో జాఫర్ అనే వ్యక్తి 20 టన్నుల గో మాంసం తరలిస్తున్నట్టుగా ఒడిషాలోని హిందూసమాజ్ సభ్యులకు సమాచారం అందింది. దీంతో సమాజ్ సభ్యులు వ్యాన్ కోసం కాపుగాశారు. బోజ్‌పూర్ జిల్లా జానాపూర్ వద్దు చేరిన వ్యాన్‌ను నిలిపివేశారు. పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు పాలవ్యాన్ ను స్వాధీనం చేసుకున్నారు. మాంసాన్ని మట్టిలో పూడ్చివేశారు. వ్యాన్ నెంబరు ఏపీ03 5655గా గుర్తించారు. రవాణాశాఖ రికార్డుల ప్రకారం వ్యాన్ జాఫర్ అనే వైసీపీ నేత పేరిట నమోదై ఉన్నట్టు గుర్తించారు. వ్యాన్ డ్రైవర్, క్లీనర్‌ను అరెస్ట్ చేశారు. పాల వ్యాన్‌ల ముసుగులో చానాళ్లుగా తాము ఇలా మాంసం తరలిస్తున్నామని, పోలీసులు పాల వ్యాన్ తనిఖీ చేయరనే ధైర్యంతో ఇదంతా చేస్తున్నామంటూ డ్రైవర్, క్లీనర్ ధైర్యంగా చెప్పటం కొసమెరుపు. మరి దీనిపై వైసీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారిందట. ఈ వ్యవహారంలో జాఫర్ ప్రమేయం ఉందా! ఎవరైనా అతడి పేరుతో ఇటువంటి చీకటి కార్యకలాపాలు నడుపుతున్నారా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.




రాజకీయ నాయకులు కొందరికి చీకటి వ్యాపారం సర్వసాధారణం.దొరికిన వాడు దొంగ, దొరకని వాడు దొర సామెత ఉందిగా