క‌నిక‌రిస్తున్న క‌రోనా!

మీరు చ‌దివింది అక్ష‌రాలా నిజ‌మే. ఎవ‌రెన్ని చెప్పినా.. క‌రోనా వైర‌స్ తీవ్ర‌త క్ర‌మంగా త‌గ్గుతోంది. భార‌త‌దేశంలో అగ‌స్టు 16 వ‌ర‌కు వ‌ర‌కూ 3.41కోట్ల మందికి కొవిడ్‌19 వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వహించారు. ఇప్ప‌టి దాకా ఇండియాలో సుమారు 27 ల‌క్ష‌ల మంది వైర‌స్ భారీన‌ప‌డ్డారు. అధిక‌శాతం కోలుకుని ఇళ్ల‌కు చేరారు కూడా. సోమ‌వారం ఒక్క‌రోజే సుమారు 60 వేల మంది ఎంచ‌క్కా కోలుకుని ఆసుప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. వీట‌న్నింటినీ మించి చెప్పాల్సిన మ‌రో శుభ‌వార్త ఏమిటంటే.. వైర‌స్‌కు గురైన వారిలో 80శాతం మంది హోమ్ క్వారంటైన్‌లో ఉండే చికిత్స తీసుకుంటున్నారు. భార‌తీయుల్లో స‌హ‌జంగానే వ్యాధినిరోధ‌క‌శ‌క్తి అధికంగా ఉంటుంది. ఉష్ణ‌, శీత‌ల వాతావ‌ర‌ణాన్ని త‌ట్టుకోగ‌ల స‌త్తా కూడా ఉంటుంది. అస‌లు త‌మ‌కు వైర‌స్ వ‌చ్చింద‌ని తెలియకుండానే 50శాతం మందిలో యాంటీబాడీస్ కూడా త‌యారవుతున్నాయ‌ట‌. అమెరికా, ర‌ష్యా, ఫ్రాన్స్ త‌దిత‌ర దేశాలు భావించిన‌ట్టుగా.. కొత్త వైర‌స్‌లు పుట్టుకొస్తున్నాయ‌నే వార్త‌ల‌ను కూడా ఇండియ‌న్లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ట్లేదు. దైనందిన కార్య‌క్ర‌మాల్లో మునిగిపోతున్నారు. వ‌య‌సు మీద‌ప‌డిన నేత‌లు కూడా వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నారు. గుండెజ‌బ్బులు, ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు, పొగ‌తాగ‌టం, మ‌ద్య‌పానం అల‌వాటు ఉన్న‌వారిలో మాత్ర‌మే వైర‌స్ తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. అది కూడా వైర‌స్ ప‌రీక్ష‌లు చేయించుకోవ‌టంలో జాప్యం చేయ‌ట‌మే వీరిలో వ్యాధి తీవ్ర‌త పెరిగేందుకు కార‌ణ‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. ఏమైనా.. భార‌త్‌లో క‌రోనా కాస్త క‌నిక‌రం చూపిన‌ట్టుగానే జ‌నం భావిస్తున్నారు. అయినా.. సామాజిక దూరం పాటించ‌టం, చేతులు శుభ్ర‌ప‌ర‌చుకోవ‌టం, ముఖానికి మాస్క్ ధ‌రించ‌టం మాత్రం కొంత‌కాలం కొన‌సాగించాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here