తనపై 139 మంది 5 సంవత్సరాల పాటు రేప్‌చేశారంటూ ఓ బాధితురాలి ఫిర్యాదు పోలీసులకు షాక్. పోనీ ఆమెకు మతిభ్రమించిందా! అనుకుంటే అదీ లేదు. పైగా ప్రజాసంఘాల మద్దతు. మరో వైపు బాధిత మహిళ ఎస్టీ కావటంతో మరింత సవాల్‌గా మారింది. ఈ నెల 21న ఓ యువతి హైదరాబాద్ పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఏకంగా పోలీసులు 42 పేజీల ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్(ఎఫ్ఐఆర్) తయారు చేశారు. ఇంతమందిని విచారించాలంటే మాటలా! అందుకే విషయం డీజీపీ వద్దకు చేరింది. క్రైమ్‌బ్రాంచ్‌పోలీసులకు కేసు దర్యాప్తును అప్పగించారు. రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు బాగానే కూపీ లాగుతున్నారు. ఆమె వెనుక ఎవరో ఉన్నారనే అనుమానాలకు బలాన్ని చేకూర్చేలా ఓ ఘటన జరిగింది. మరో విధంగా చెప్పాలంటే క్లూ దొరికంది. అదే.. డాలర్‌బాయ్.. ఆ పేరుతో ఎవరో అగంతకుడు నిందితులను బెదిరిస్తున్నాడు. బాధితురాలికి తానే ఏజెంట్‌ను అనే విధంగా అతడి హెచ్చరికలు ఉన్నాయట. దీంతో ఆమెను షెల్టర్ హోమ్‌కు తరలించారు. డాలర్‌బాయ్ ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు 139 మందిపై నిర్భయచట్టం కింద కేసు నమోదుచేయటం ఇదే తొలిసారి. పోలీసు నోటీసులు అందుకున్న వారిలో కొందరు స్పందించారు. అసలు తమకు సంబంధంలేని కేసులో ఇరికించారంటూ బుల్లితెర యాంకర్ ప్రదీప్ తాజాగా వీడియో విడుదల చేశాడు. తన పేరును బద్నాం చేయటం పల్ల ఆగ్రహం.. ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై తాను లీగల్‌గా వెళ్తానంటూ హెచ్చరించాడు కూడా. ఏమైనా. బాధితురాలి ఫిర్యాదులో వాస్తవాలు.. దీనివెనుక దాగిన రహస్యాలు సీసీఎస్ పోలీసులు త్వరలోనే బయటక తీస్తారు.