ఊపిరితిత్తులు.. అదేనండీ లంగ్స్ . ప్రాణవాయువు శరీరంలో కణకణానికి చేరేందుకు ఆధారం. పొగతాగటం.. వాయుకాలుష్యంతో అవి దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ మొదట దాడిచేసేది కూడా లంగ్స్‌పైనే. అధికశాతం బాధితుల మరణానికి అదే కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. కొవిడ్19 తట్టుకునేందుకు శరీరాన్ని తయారు చేయటమే ఇప్పుడు మానవాళి ముందున్న పరిష్కారం. ఎందుకంటే. వైరస్ శరీరంలోకి ప్రవేశించినా రోగనిరోధకశక్తి దాన్ని తట్టుకుంటుంది.. పోరాడేందుకు అవసరమైన ప్లాస్మా కొద్దిసమయంలోనే తయారయేందుకు సహకరిస్తుంది. ఊపిరితిత్తులు బాగా ఉన్నపుడే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని గుర్తంచుకోండి. అంతటి విలువైన ప్రాణాధారమైన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని సూత్రాలు
పాటిస్తే చాలంటున్నారు న్యూట్రీషియన్లు.
వాలనట్స్: డ‌్రైఫ్రూట్స్‌లో ఇదొకటి.. ప్రోటీన్లు, విటమిన్లు, మెగ్నీషియం, వంటివి ఉంటాయి.. ఇది శరీరంలో రక్తప్రసరణ సరిగా సాగేందుకు సహకరిస్తాయి. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేలా రక్షణగా ఉంటాయి. బీపీ, షుగర్‌తో బాధపడేవారు కూడా తీసుకోవచ్చు.
నీరు: శరీరంలో నీరు తగినంత ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి గోరువెచ్చటి నీటిని తరచూ తీసుకోవాలి. దీనివల్ల గొంతులో ఉన్న శ్లేష్మం..(కళ్లె) బయటకు వస్తుంది. ఊపిరి ఆడకపోవటం, ఆయాసం రావటానికి ఇవే కారణాలు.
నిమ్మ.. దానిమ్మ: నిమ్మలో సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఉదయాన్నే వెచ్చనినీటిలో నిమ్మకాయ, తేనే కలిపి తాగితే బలమే కాదు.. ఉత్సాహం వస్తుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు నిల్వలు కూడా కరుగుతాయి. దానిమ్మ.. వలచుకుని తినటం బద్ధకం అయినా.. తినటం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. రక్తశుద్ధి, జీర్ణక్రియ చక్కగా పనిచేసేలా చేస్తుంది. వేరుశనగపప్పు, బాదంపప్పు కూడా శరీరానికి ప్రొటీన్లను అందిస్తాయి. శ్వాస చక్కగా సాగేందుకు రోగనిరోధకశక్తి చాలా కీలకమని గుర్తించండీ.