బ్రహ్మంగారు ఆనాడే కాలజ్క్షానంలో చెప్పారు.. కొక్కిరాయ రోగం వచ్చి రెండు కోట్ల మంది మరణిస్తారని.. ఆపద వచ్చినపుడు ముఖ్యంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ సంప్రదాయవాదులు గుర్తు చేసుకున్నమాట. నిజమే.. కానీ ఎంతమంది ఈ భయానికి కట్టుబడి ఉన్నారు. కనీస జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే.. లేదనే సమాధానం వస్తుంది. కరోనా వైరస్ సోకుతుందనే భయం చాలా మందిలో ఉంది.. కానీ.. వచ్చినా కషాయంతో తగ్గుతుంది. కాదంటే.. ఆసుపత్రులకు పోదామనే నిర్లక్ష్యధోరణి విపరీతంగా పెరుగుతోంది. ఎంతగా . అంటారా.. ఇప్పుటికప్పుడు భారతీయుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదు ఎంతో తెలుసా! అక్షరాలా రూ. 60లక్షల కోట్లరూపాయలు.. వింటనే కళ్లు తిరుగుతున్నాయి కదూ! ఎందుకింత దాచుకున్నారంటే.. ఒకే మాట.. కరోనా వల్ల రోగం వచ్చినా.. డబ్బులకు ఇబ్బంది రాకూడదనేనంటూ సమాధానం చెబుతున్నారు. ఇంత ముందుచూపుతో పొదుపు చేయటం బాగానే ఉంది. కానీ.. వైరస్ సోకుతుందనే భయం లేకపోవటం.. విచ్చలవిడిగా తిరగటం.. ముఖానికి మాస్క్‌లు.. వ్యక్తిగత దూరం విస్మరిస్తున్నారు. ఫలితంగా.. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుందో.. ఒక్కసారి చూడండీ. అప్పటికీ మీలో మార్పు రాకపోతే.. మీ తలరాత మీరే రాసుకున్నట్టుగా లెక్కలు వేసుకోండి. ఎందుకంటే.. నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటుంది.. అదెలా అంటారా..!!
భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 47 లక్షలు. శుక్రవారం నమోదైన కేసులు 97,570. మరణాలు 1201. అంటే సగటున ప్రతిరోజూ 97,000 కేసులు నమోదవుతున్నాయి. గంటకు 50-60 మంది మరణిస్తున్నారని అంచనా. వీళ్లంతా కరోనా వల్ల మాత్రమే కాదు.. కొవిడ్19 పరీక్ష చేయటంలో ఆలస్యం.. వైద్యం సకాలంలో ఇవ్వకపోవటం వల్ల మరణిస్తున్నవారే. వీరిలో 21-45 సంవత్సరాల మధ్య ఉన్నవారు బారీగా ఉంటున్నారు. కరోనా వ్యాక్సిన్ ఎప్పటి వరకూ వస్తుందనే నమ్మకం లేదు. నాలుగు వైరస్‌లను కలిపి ఇస్తే కొత్తరూపంగా ఉద్భవించిన వైరస్ కరోనా. దీనిపై పూర్తిస్థాయి పరిశోధనలు కూడా జరగట్లేదు. రోజుకో రూపంతో.. దేశానికో ప్రభావం చూపుతున్న కరోనా మున్ముందు సృష్టించబోయే మారణహోమంపై ప్రపంచమంతా భయపడుతోంది. కానీ.. ప్రజలు మాత్రం డబ్బుంటే చాలంటూ.. బ్యాంకు బ్యాలెన్స్ చూసుకుంటున్నారు. కానీ.. రాబోయే ప్రమాదంగురించి అంచనా వేయలేకపోతున్నారు.
ఇప్పుడు రోజుకు లక్ష కేసులు వస్తుంటేనే బెడ్లు లేవంటున్నాయి ఆసుపత్రులు. అదే.. వచ్చే ఏడాది అంటే.. 2021 నాటికి రోజుకు 3-3.5 లక్షల కేసులు నమోదైతే.. ఏం చేయాలి. మార్చి నెలలో కేవలం 4 కేసులతో మొదలైన కరోనా ఇప్పుడు 50 లక్షలకు దగ్గరైంది. చూస్తుండగానే.. కోటి చేరేందుకు మరో మూడు నెలలు చాలంటున్నాయి పరిశోధనల సంస్థలు. నెల రోజుల క్రితం వరకూ భయపడిన ప్రజలు కరోనాను లైట్‌గా తీసుకుంటున్నారు. అన్‌లాక్ కేవలం ప్రజలకే… వైరస్‌కు కాదని గుర్తించలేకపోతున్నారు. దుకాణాల వద్ద, వైన్‌షాపుల దగ్గర, రోడ్లమీద, హోటల్స్, రెస్టారెంట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాంతాడంత జాబితాలో ఉన్న ప్రతిచోట.. జనం భారీగా గుమికూడుతున్నారు.
హమ్మయ్య తమకేం కాదనుకుంటూనే.. వైరస్‌ను ఒంట్లోకి.. ఆ తరువాత ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. వారం రోజుల వరకూ ఏవో మందులు వాడి.. చివరి క్షణంలో శ్వాస అందటం లేదంటూ ఆసుపత్రులకు చేరుతున్నారు. లక్షలు రూపాయలు చెల్లించే స్తోమత ఉన్నా.. అప్పటికే దెబ్బతిన్న ఊపిరితిత్తులు సాధారణ స్థితికి రాలేకపోతున్నాయి. ఊపిరితీయలేమంటూ ఊపిరి ఆపేస్తున్నాయి.. కోట్లాది మంది అభిమానులు.. పలు ప్రభుత్వాలు ఆర్ధికసాయంతో ది గ్రేట్ సింగర్ బాలసుబ్రమణ్యం ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఇంత ఆధునిక వైద్యం అందిస్తున్నా.. 45 రోజులుగా ఆయన కోలుకోలేకపోయారు. మరి కూలీనాలీ చేసుకుంటూ.. ఏదో చిన్న ఉద్యోగమో..వ్యాపారమో చేసుకునే సగటు మనుషులు ఇంత ఖర్చు భరించగలరా! వీరి ప్రాణం కోసం ఎవరైనా ప్రార్థిస్తారా! కనీసం.. పైసా సాయం చేస్తారా! ఒక్కసారి ఆలోచించండి.. వైరస్ తమ చుట్టూ ఉందనే విషయాన్ని గుర్తించి జాగ్రత్తలు పాటింకపోతే….!