ప్రపంచ వ్యాప్తంగా నాలుగేళ్లకొకసారి ఆసక్తి రేపుతున్న అంశం అమెరికా అధ్యక్ష ఎన్నికలు. వచ్చే నవంబర్లో జరుగబోయే 59 వ అధ్యక్ష ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ తరుపున డోనాల్డ్ ట్రంప్ మరియు ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న జోసెఫ్ రోబినెట్ బైడెన్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. భారత సంతతికి చెందిన కమలా హారీస్ ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాటిక్ పార్టీ తరుపున పోటీలో నిలవడం అటు అమెరికాలో స్థిరపడ్డ ఇండో- అమెరికెన్లకు, ఇటు యావత్ ప్రజానీకానికి ఆసక్తి రేపే విషయం.
538 మంది సభ్యులున్న సెనేట్ సభలో 270 మంది గెలిపించుకొని ఏ పార్టీ అభ్యర్థిని
అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతుంది అనే దానిపై ఉత్కంఠత నెలకొన్నది..అనేక సంస్థలు చేప్పట్టిన ముందస్తు ఎన్నికల సర్వేలు జో బైడెన్ కు అవకాశాలు ఎక్కువున్నట్లు తెలియజేస్తున్నాయి.
వివిధ భాషలు, మతాలు, జాతులు, సంస్కృతులు, కలిగిన వలస దేశం అమెరికా. అక్షరాస్యత , ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ ఉండటం వల్ల గెలుపు ఇరువర్గాలకు నల్లేరుమీద నడక కాబోదు. గత నాలుగు సంవత్సరాలుగా అధ్యక్షుడుగా ఉన్న డోనాల్డ్ ట్రంప్ తీసుకొన్న వివాదాస్పద నిర్ణయాలు దేశీయంగా అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ముందస్తు ఎన్నికల సర్వే చేపట్టిన సంస్థలు కొన్ని ప్రధాన అంశాలను అభివృద్ధి సూచికలుగా నిర్ణయించి సర్వే జరిపాయి. అవి.. Economy, Health Care, Supreme Court Appointments, Violence and Crime, Foreign Policy, Climate Change, Carona Virus, Immigration Rules, Race & Ethnic Inequality, Gun Policy, Abortion, Economic Inequality వంటి 12 అంశాలలో ట్రంప్ ను వ్యతిరేకిస్తూ, జో బైడెన్ పై నమ్మకం ఉంచారు.
మరొక విషయం ట్రంప్ పరిపాలన పట్ల విశ్వాసం నమ్మకం ప్రకటించలేదు..
జో బైడెన్ కు మంచి పరిపాలన దక్షత లేదనే వాదన కూడా లేకపోలేదు..
ట్రంప్ వ్యతిరేక ప్రధాన అంశాలు..
కరోన వైరస్ ప్రభావాన్ని సరిగా అంచనా వేయలేకపోవడం. 188000 మంది పౌరులు చనిపోయిన తరువాత కూడా నియంత్రించలేకపోవడం బైడెన్ కి కలిసొచ్చిన అంశం
జార్జ్ ఫ్లాయిడ్, బ్రెయిన్నో టైలర్ వంటి నల్లజాతీయులను అమెరికా పోలీసులు క్రూరంగా హింసించి చంపిన ఘటనలను నిరసిస్తూ జరిగిన ఉద్యమాలు
H1 వీసాల జారీలో తీసుకున్న వివాదాస్పద గందరగోళ నిర్ణయాలు
ముస్లిమ్ వలసదారులను అడ్డుకునే రీతిలో జారిచేసిన ఉత్తర్వులు
సుప్రీం కోర్ట్ నియామకాలు
గత ఎన్నికల్లో అత్యంత మెజారిటీ ఓట్లు రాల్చిన వర్జీనియా, విసుకోన్సిన్, ఫ్లారిడా వంటి రాష్ట్రాల్లో పట్టు తప్పిపోవడం
మొదలగునవి..
అయితే 1.8 మిలియన్ ఓటర్లున్న భారత-అమెరికెన్ల దారెటు అనే విషయం పై
Asian American and Pacific Islands(AAPI)
Data సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ డా.కార్తీక్ రామకృష్ణన్ చేయించిన ఎన్నికల సర్వే ప్రకారం 30 శాతం మంది. ట్రంప్ కి, 70 శాతం మంది బైడెన్ కే ఓకే చెప్పారు. గత ఎన్నికల్లో 77 శాతం డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కి, 16 శాతం వలస భారతీయులు మాత్రమే ట్రంప్ కి మద్దతు పలకడం గమనార్హం. బారక్ ఒబామా 2012 లో పోటీ చేసినపుడు 84 శాతం మంది భారతీయులు ఒబామాకు ఆమోదముద్రవేశారు. దీన్ని బట్టి చూస్తే మొదటినుండి భారత- అమెరికన్లు డెమొక్రాట్ అభ్యర్థులకే స్వాగతం పలుకుతున్నట్లు అవగతమవుతున్నది.
భారతీయులు ఎక్కువగా ఉన్న పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, వర్జీనియా, ఫ్లారిడా, మిచిగాన్, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఓటింగ్ సరళి మారవచ్చని సిఫాలజిస్ట్ ల అభిప్రాయం.
గత నవంబరు లో ట్రంప్ నిర్వహించిన Modi Howdy in Hoston,
ఈ సంవత్సరం ఫిబ్రవరి లో Ahmadabad లో మోడీ నిర్వహించిన నమస్తే ట్రంప్ వంటి కార్యక్రమాలు భారత ఓటర్లను ఆకర్షించలేవని కొందరి అభిప్రాయం.
డెమొక్రాట్ లు మొదటినుండి భారత్ కి అనుకులమేనని చరిత్ర చెబుతోంది.
1971 లో పాక్ – భారత వివాదంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ (రిపబ్లికన్ పార్టీ ) పాక్ వైపు కొమ్ము కాయడం..
1980 దశకం లో అదేపార్టీ కి చెందిన అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ పాక్ లో ఐ. స్.ఐ. కి ఆర్ధికంగా సహాయం చేయడం, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ తో విభేదాలు, నిరంతరం భారత్ పై కయ్యానికి కాలుదువ్వడం..
వంటి విషయాలు రిపబ్లికన్ పార్టీ విధానాన్ని తేటతెల్లం జేస్తుంది..
ఇక డెమోక్రాటిక్ పార్టీ కి చెందిన అధ్యక్షుల విషయానికొస్తే..
భారత్ అణు పరీక్షలు నిర్వహించడం వలన విధించిన ఆర్ధిక ఆంక్షలను జార్జ్ బుష్ జూనియర్ ఎత్తివేయడం
బిల్ క్లింటన్ కార్గిల్ యుద్ధంలో భారత్ కి మద్దతు పలకడం.
భారతలో 2015 గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిధిగా బారక్ ఒబామా రావడం వంటి విషయాలు
డెమోక్రాట్లు భారత్ తో మైత్రి నెలకొల్పారనే చెప్పొచ్చు.
బైడెన్ విషయానికోస్తే..
భారత సంతతికి చెందిన ఆఫ్రికన్- కరేబియన్ అయిన కమలా హారీస్ ను ఉపాధ్యక్ష పదవికి ఎంచుకోవడం అటు నల్లజాతీయులు, ఇటు భారతీయుల ఓట్లు తనకు అనుకూలంగా బాలెట్ బాక్స్ లను నింపుతాయని నమ్మకం..
కాశ్మీర్ విభజన, 370 ఆర్టికల్ రద్దు వంటి విషయాల్లో బైడెన్ అనుకూలత ప్రకటించడం.
అమెరికా కా నేత కైసాహో
జో బైడెన్ జైసా హో
వంటి నినాదంతో కూడిన వీడియో సి.డి లను హిందీ, పంజాబీ, తమిళం, తెలుగు, బెంగాలీ, ఉర్దూ, మలయాళం, కన్నడ, ఒరియా, మరాఠీ, నేపాలీ భాషాల్లో తయారు చేయించి చేసే ప్రచారం కలిసొచ్చే అంశం.
టిబెట్ విషయం లో తాను భారత్ పర్యటనకు వచ్చినపుడు బౌద్ధ గురువు దలైలామను కలుస్తానని చైనాకు వ్యతిరేఖంగా చేసిన ప్రకటన బైడెన్ విదేశీ విధానాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది.
బైడెన్ 2006 లో రెడీఫ్-ఇండియా సంపాదకుడు అజయ్ భటోరియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో..
My dream is that in 2020 the closest nations in the world will be India and USA
అన్న మాటలు నిజం చేయబోతాడా లేదా తెల్ల జాతీయుల ఎక్కువ మద్దతున్న ట్రంప్ మళ్ళీ అమెరికా పరిపాలనా పగ్గాలు చేపడతాడా అనే విషయం తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచిచూడాల్సిందే..
విశ్వేశ్వరరావు పెర్నా – విశ్లేషకులు