నిశ్శబ్దం చెబుతున్న నిజం!!

వినికిడి శక్తి కోల్పోవడంపై మీకు అవగాహన ఉందా?

 వినికిడి శక్తి కోల్పోవడం అంటే వినే శక్తిని కొంత మేర లేదా పూర్తిగా కోల్పోవడం.  ఇలా వినికిడి శక్తి కోల్పోవడాన్ని నేరుగా చూడలేము మరియు దాని ప్రభావం ఇతరులకు కనపడదు.  దీంతో వినికిడి శక్తి కోల్పోయిన వారు నిశ్శబ్దంగా భాదపడుతుంటారు.  కంటి చూపు లేని వారిలా కాకుండా, వినికిడి శక్తి లేని వారు తోటి సమాజం నుండి సానుభూతి బదులు ఎగతాళి చేయబడుతారు.  దీంతో కుటుంబ సభ్యులతో పాటూ స్నేహితుల కు దూరమై, ఇతరులలో ఎటువంటి సానుభూతి లేని వ్యవహార శైలితో పూర్తిగా ఆందోళన, ఒత్తిడికి లోనై తరచుగా మానసిక వైద్య నిపుణులు పర్యవేక్షణ అవసరమవుతూ ఉంటుంది.

 ఇక పుట్టుకతో వినికిడి శక్తి లోపంతో పుట్టడం మరింత తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది.  వినికిడి శక్తి లేని చిన్నారులలో మాట్లాడడడం మరియు భాష నేర్చుకోవడమనే సామర్థ్యం అభివృద్ది చెందదని మనకి పరిశోధనల ద్వారా తేలిన అంశం.  ఇది ఈ చిన్నారిని పాఠశాల, కళాశాలలో వెనుకబడేలా చేసి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.  ఇక పుట్టినప్పటి నుండి వినికిడి శక్తి కోల్పోవడం ఒక ఎత్తైతే పెద్ద వారైన తర్వాత అంటే పాఠశాల పూర్తయిన తర్వాత లేదా పెరిగిన తర్వాత వినికిడి శక్తి కోల్పోవడం కోల్పోవడం మరొక విధమైన సమస్యలకు దారి తీస్తుంది.  ఇక కొన్ని సంవత్సరముల కాల వ్యవధిలో నెమ్మదిగా వినికిడి శక్తిని కోల్పోయిన వారి ఇబ్బందులు మరొక రకంగా ఉంటాయి.  అయితే ఇలాంటి వారెవరికైనా ప్రతికూలత ఒకటే.  అది వినలేని నిశ్శబ్దమైన ప్రపంచం, అంటే  ఇతరులతో మాట్లాడడం మరియు వినడంలో ఇబ్బందులతో ప్రతికూలత ఏర్పడడం.

 వినికిడి శక్తి కోల్పోవడం – భారత దేశ స్థితిగతులు

 భారత దేశంలో 63 మిలియన్ల ప్రజలు అంటే షుమారు జనాభాలో 6.3 శాతం ఏదో          ఒక రకమైన వినికిడి లోపంతో భాదపడుతున్నారు.  ప్రతి వెయ్యి మంది చిన్నారులలో నలుగురు తీవ్రమైన లేదా పూర్తిగా లేని వినికిడి శక్తి లోపంతో సతమతమవుతున్నవారే.  ఇలాంటి స్థితిగతులతో ఏటా లక్ష మంది చిన్నారులు జన్మిస్తున్నారనేది ఒక అంచనా.  ఇక వయస్సు మళ్లిన వారిలో ఏర్పడే వినికిడి శక్తి భారతీయ జనాభాలో 7.6 శాతంగా ఉండగా పాఠశాల విద్య పూర్తి చేసుకొన్న వారిలో 2 శాతంగా ఉందని పరిశోదనలు వెల్లడిస్తున్నాయి.

 వినికిడి శక్తి లోపం ఏర్పడడానికి గల కారణాలు

 వినికిడి శక్తి లోపాలు ఏర్పడడానికి పుట్టుకతో వచ్చే లేదా సంపాదించుకొన్న అంశాలు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

పుట్టుకతో వినికిడి శక్తి కోల్పోవడానికి గల కారణాలు

  • మెటర్నల్ రుబెల్లా, సిఫిలిస్ లేదా గర్భదారణ సమయంలో ఏర్పడే ఇతరత్రా ఇన్ఫెక్షన్లు
  • తక్కువ బరువుతో జన్మించడం
  • పుట్టినపుడు అస్ఫిక్సియా ఉండడం అంటే బిడ్డలో సరైన ఆక్సిజన్ మోతాదు లేక పోవడం
  • ఓటోటాక్సిక్ మందులైన అమినోగ్లైకోసైడ్స్, సైటోటాక్సిక్ మందులు, యాంటీ మలేరియా మందులు మరియు డయూరెటిక్స్ వంటి వాటిని గర్భధారణ సమయంలో ఇష్టానుసారం వినియోగించడం
  • పుట్టిన వెంటనే తీవ్రమైన కామెర్ల వ్యాధితో పుట్టడం వలన వినడానికి కారణమన నరాలు దెబ్బతిని అపుడే పుట్టిన బిడ్డలో వినికిడి శక్తి కోల్పోవడానికి కారణమవుతుంది.

మనం సంపాదించుకొనే కొన్ని ఇతరత్రా కారణాల ద్వారా ఏ వయస్సులోనైనా వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం

  • మెనింజైటిస్., తట్టు మరియు గవదబిల్లలు లాంటి అంటు వ్యాధుల కారణంగా చిన్నతనంలో వినికిడి శక్తి కోల్పోవడానికి అవకాశముంటుంది. అయితే ఇదే సమస్య పెద్ద వారైన తర్వాత కూడా తలెత్తవచ్చు.
  • సుదీర్ఘకాల చెవిలో ఇన్ఫెక్షన్ ఉండడం అంటే చెవి నుండి ద్రవాలు కారుతుండడం వలన కూడా వినికిడి శక్తి కోల్పోవచ్చు. కొన్ని సందర్భాలలో ఈ పరిస్థితి మరింత తీవ్రమై ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే ఆస్కారం ఉంటుంది అంటే మెదడులో కణితులు లేదా మెనింజైటిస్ వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు.
  • చెవిలో ద్రవాలు చేరడం (ఓటిటిస్ మీడియా స్రవిస్తూ ఉండడం) వలన కూడా వినికిడి శక్తి కోల్పోవచ్చు
  • ఓటోటాక్సిక్ మందులైన అమినోగ్లైకోసైడ్స్, సైటోటాక్సిక్ మందులు, యాంటీ మలేరియా మందులు మరియు డయూరెటిక్స్ వంటి వాటిని ఉపయోగించడం వలన చెవిలోపలి భాగం దెబ్బతింటుంది.
  • ఎక్కువ శబ్దం లేదా ఎక్కువ స్థాయి సంగీతం లేదా ఇతరత్రా ఎక్కువ శబ్దాల మధ్య పని చేయడం అంటే పేలుళ్లు లేదా తుపాకులు పేలుతూ ఉండడం లాంటి కారణాలతో కూడా వినికిడి శక్తి పోవచ్చు.
  • వయస్సు పెరిగే కొద్దీ శబ్దాన్ని గ్రహించే కణజాలంలో ఏర్పడే క్షీణతల కారణంగా వినికిడి శక్తి కోల్పోవచ్చు
  • మైనం వంటి పలు ఇతరత్రా బాహ్యపు పదార్థములు చెవి కాలువను పూర్తిగా మూసి వేయడం వలన కూడా ఏ వయస్సులోనైనా వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది.

త్వరగా గుర్తించడమే తక్షణ కర్తవ్యం

60 శాతం వినికిడి శక్తి కోల్పోయే కేసులను మనం పూర్తిగా అరికట్టవచ్చు.  మందులు, శస్త్ర చికిత్స లేదా సరైన వినికిడి పరికరములు ధరించడం ద్వారా మనకు ఏర్పడుతున్న వినికిడి శక్తి లోపాన్ని సరి చేసుకోవచ్చు.

ఒక వేళ మీకై మీరే లేదా కుటుంభ సభ్యుల ద్వారానో లేదా స్నేహితుల ద్వారానో మీ వినికిడి శక్తిపై వాఖ్యలు వినాల్సి వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా మీ వినికిడి శక్తిని పరీక్షించుకోవడం ఎంతో అవసరం.  ఇందుకోసం ఓటోలారిన్జాలజిస్ట్ లేదా సర్వసాధారణ భాషలో చివి, ముక్కు, నాలుక (ENT) వైద్యులను మీరు సంప్రదించాల్సి ఉంటుంది.  సందర్భాన్ని బట్టి మీ ENT వైద్యులు ఆడియాలజిస్టు తో కలసి మీపై పరీక్షలు నిర్వహించి, గతాన్ని పరిశీలించి, వ్యాధి నిర్థారణ చేసి అవసరమైన చికిత్స అందిస్తారు.

సమగ్రమైన విధానం

ఇంట్లో మరియు వెలుపల ఉండే కళంక స్థితి కారణంగా వినికిడి శక్తి ఉన్న వారు ఆ స్థితిని లేదంటూ చికిత్స తీసుకోవడానికి నిరాకరిస్తున్న నేపధ్యంలో సామాజికంగా ఇతరులతో మసలుకోవడం తప్పించుకొంటూ, ఖచ్చితమైన రాతలు లేదా మాటలు మాట్లాడడమే వ్యూహాన్ని ప్రక్కపెట్టి, అసలు మనుష్యులకు దూరంగా ఉండడం, ఒత్తిడి, ఆందోళనకు గురై సరైన రీతిలో జ్ఞాపకాలు కోల్పోయే ఇబ్బందులతో భాదపడుతుంటారు.

 ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి వ్యక్తి తనకు వినికిడి లోపం ఉందన్న విషయాన్ని గుర్తించి దానిని ఒప్పుకొని దాని వలన కలిగే ఇతరత్రా కళంకాల కారణంగా వచ్చే సమస్యలు లేదా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం ఏర్పడడం వంటి వాటిని అర్థం చేసుకొని తన వారితో లేదా తన చుట్టూ ఉండే వారితో దీనిపై చర్చించి తద్వారా వ్యక్తిగత ప్రతిష్టకు ఏర్పడుతున్న ఇబ్బందులను, బిడియాన్ని మరియు తగ్గుతున్న ఆత్మగౌరవ సమస్యల నుండి బయటపడవచ్చు.

 వినికిడి శక్తి కోల్పోతున్న వారే కాదు సమాజమంతా ఈ లోపంపై అవగాహన ఏర్పరచుకోవాలి

 వినికిడి శక్తి కోల్పోయిన వ్యక్తులకు మాత్రమే కాదు ఈ సమస్యపై పోరాడుతున్న లేదా పోరాడుతున్న వారికి మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా మద్దతు తెలపాల్సిన లేదా తెలుపుతున్న వారిలో కూడా అవగాహన ఉండడం ఎంతో అవసరం.  ఈ సమస్యపై కుటుంభం పూర్తిగా అర్థం చేసుకొని, తగిన సమాచారాన్ని గ్రహించి తద్వారా ఈ ఆరోగ్య సమస్యను మరింత తీవ్రంగా పరిగణించడమే కాకుండా దీని వలన ఏర్పడుతున్న మానసిక ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేయడం అందరి కర్తవ్యం.  ఈ దిశగా సమాజంలో అందరికీ అవగాహన ఉండడం అత్యావశ్యకం.

మన సమాజంపై వినికిడి శక్తి లోపం ఉండడం కారణంగా పడుతున్న తీవ్రమైన సామాజిక, ఆర్థిక మరియు ఉత్పాదక జీవనం కోల్పోవడం కారణంగా మన దేశంపై పడుతున్న ప్రభావాన్ని గుర్తించి ఈ ఆరోగ్య సమస్యను ఎదుర్కోవడానికి అవసరమైన మానవ వనరులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యవస్థలు ఏర్పాటు చేయడం వంటి వ్యూహాలతో వినికిడి శక్తి కోల్పోవడాన్ని భారత దేశంలో అరికట్టవచ్చు.

 వినికిడి శక్తికి సహాయపడే పరికరములు ధరించడాన్ని గౌరవానికి భంగంగా భావించడం

 వినికిడి శక్తికి సహాయపడే పరికరములను అందరికీ కనపడేలా ధరించడం గౌరవానికి భంగం కలిగించడమని భావిస్తే ఇతరులు చెప్పే అంశాన్ని పలు మార్లు చెప్పమనడం అందరికీ తెలియదా లేదా గౌరవానికి భంగం కలిగించే అంశం కాదా అని ప్రశ్నించుకోండి.  మనకు తెలియకుండానే మన ప్రవర్తన సమాజం ఆశించే రీతిలో ఉండాలని ఆశిస్తూ ఆ దిశగా కదులుతుండడమే కాకుండా వినికిడి శక్తి లోపమనేది వయస్సు మళ్లిన వారిలో మాత్రమే ఏర్పడే అంగవైకల్యంగా భావిస్తూ ఈ లోపం కారణంగా ఏర్పడే అంతర్లీన వ్యతిరేఖ పరిస్థితులను బేరీజు వేసి చూసుకోవాలి.

 వినికిడి శక్తి కోల్పోవడం ద్వారా ఇతరులతో సంభాషించడంపై ఆసక్తి తగ్గిపోయి, సమాజంలో ఒంటరిగా మారడమనేది మరింత ప్రమాదకరమైనది.  ఎందుకంటే వారు తమ తమ వ్యవహారాలు లేదా పని కారణంగా ఇతరులతో సంభాషించే పరిస్థితి నుండి తప్పించుకొని తద్వారా ఒంటరి తనం లేదా ఒత్తిడి, ఆందోళనకు గురవ్వడం మరింత ప్రమాదం. దీనిని గమనించాలి.

 మన ఆరోగ్యమే మన భాగ్యం ఎందుకంటే దీనిని ఎవరూ దొంగలించలేరు కదా, అంగీకరిస్తారాఅంటే అవుననే చెప్పాలి.  సమాజంలో, మానసికంగా, ఆర్థికంగా మరియు మంచిగా పని చేసే స్థితిలో ఉండడం అనేవి మిమ్మల్ని లేదా నన్ను గుర్తించడానికి దోహదపడుతాయి.  ఇందుకోసం వినికిడి శక్తి కోల్పోయిన వారికి సరైన సమయంలో చికిత్స మరియు మంచి మద్దతు అందివ్వగలిగితే వారు కూడా సాధారణ జీవనాన్ని పూర్తి స్థాయిలో గడుపగలుగుతారు.

 మెటర్నల్ రుబెల్లా, సిఫిలిస్ లేదా గర్భదారణ సమయంలో ఏర్పడే ఇతరత్రా ఇన్ఫెక్షన్లు

– Dr Samyuktha Samavedam, ENT, Head and Neck Surgeon, Apollo Spectra Hospitals,  Kondapur, Hyderabad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here