తెలంగాణ ధరణి ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ధరణి పోర్టల్ (https://dharani.telangana.gov.in/) ను ప్రారంభించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల కొనుగోలు, అమ్మకాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయటానికి ఈ పోర్టల్ సహాయపడుతుంది అని సీఎం చెప్పారు. ఈ ధరణి పోర్టల్ దేశానికే మార్గదర్శకం,. కోటి నలభై ఐదు లక్షల ఎకరాల భూమి వివరాలు ఈ పోర్టల్ లో ఉన్నాయని, ఇందులో మ్యుటేషన్ ప్రక్రియను కూడా చాల త్వరగా చేయవచ్చు అని తెలిపారు. తెలంగాణ రైతుల భూముల సంరక్షణకు ఇది చాల సహాయ పడుతుంది, నవంబర్-2 నుండి ఈ సేవల్ని పొందవచ్చు అని చెప్పారు. ఈ సందర్భంగా పోర్టల్ రూపొందించుకోవటానికి రెవిన్యూ అధికారుల కష్టాన్ని అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here