ట్రంప్ అయితే ఏంటి ?… అధికారం లేదుగా !!

బెల్లం చుట్టూ చీమలు అన్న విషయం తెలుసు.. డబ్బుంటేనే బంధుత్వం… అన్న విషయం అందరికి అనుభవం… అది ఇండియాలో అయినా… అమెరికాలో అయినా… ఎక్కువ నాగరికత కలిగిన వాళ్ళం అనుకునే వాళ్లకు ఈ మోతాదు ఎక్కువే.. విషయానికి వస్తే అమెరికా ఎన్నికలలో ట్రంప్ ఓటమి పాలైన తర్వాత, అతని భార్య మిలీనా ట్రంప్ అతనికి విడాకులు ఇద్దామని ఆలోచనలో వున్నారని తెలుస్తుంది. ఇదే వార్త సోషల్ మీడియాల్లో చెక్కెర్లు కొడుతోంది.

మిలీనా ట్రంప్ కి మూడవ భార్య చాలా కాలం నుంచి వీరిద్దరి మధ్య బంధాన్ని నెటిజన్లు చర్చించుకుంటూనే వున్నారు… వైట్ హౌస్ లోని కొందరు ఉద్యోగుల అనాధికార సమాచారం ప్రకారం వీరిద్దరి బెడ్రూంలు కూడా వేర్వేరు అంతస్తుల్లో వుంటాయని తెలుస్తుంది. వీరి కుటుంబ కలహాల గురించి ట్రంప్ కూతురు ఇవంకా కొన్ని సందర్భాల్లో మిలీనా తన తండ్రికి భార్య మాత్రమే అంటూ చెప్తూ ఉండేది. ట్రంప్ గెలిచిన దాదాపు 6 నెలలకు మిలీనా కొన్ని కండిషన్ల ప్రకారం వైట్ హౌస్ కి వచ్చారు..దీన్ని కవర్ చేయటానికి తాను కొడుకు చదువుకోసం ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.

ఇంత కాలం అమెరికా మొదటి మహిళా స్థానంలో వుంటూ, ట్రంప్ పరువు తీయకూడదని అలోచించి విడాకుల ప్రస్తావన పక్కన పెట్టిందని.. ఇప్పడు ఈ ఆలోచన ఆ మొదలైందని అమెరికా మీడియాల్లో చర్చలు జరుగుతున్నాయి.. ఈ విషయాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు మన భారతీయ వివాహ వ్యవస్థ ఎంత ఉన్నతమైనదో అని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here