దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మొదటి రౌండ్ నుంచి ఐదో రౌండ్ వరకూ బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు ఆధిక్యత ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఆరోరౌండ్లోనూ అదే దూకుడు కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే సోంపేట రామలింగారెడ్డి కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ ఎస్ తరపున రామలింగారెడ్డి భార్య సుజాత ను బరిలోకి దింపారు. బీజేపీ తరపున మూడోసారి రఘునందన్ పోటీపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్ధిక చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నా నామమాత్రానికే పరిమితమయ్యారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. టీఆర్ ఎస్ తాము లక్ష ఓట్లు అంటూ ధీమాగా చెప్పింది. కానీ.. ఊహించని విధంగా తొలి రౌండ్ నుంచే బీజేపీ దూసుకెళుతోంది. ఐదోరౌండ్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు 3020 ఆధిక్యత సాధించారు. టీఆర్ ఎస్ అభ్యర్ధి సుజాత 13,497, బీజేపీ 16,517 ఓట్లు సాధించారు.