చక్కగా ముస్తాబు చేశారు.. నగలు.. కొత్త చీరతో పెళ్లి కళ ఉట్టిపడుతుందని మురిసిపోయారు. ఇంకేముంది.. పెళ్లిపీటలపై వరుడు పక్కన కూర్చోవటమే తరువాయి అనుకున్నారు. కానీ.. ఇంతలో ఊహించని సంఘటనతో పెళ్లిమండపంలో ఉన్న అతిథులు షాకయ్యారు.. పెళ్లికూతురు కనిపించట్లేదంటూ దుర్వార్త. అబ్బే.. అమ్మాయి చాలా మంచిది.. కానీ.. ఏదో అనుమానం.. అంతే.. బంధుగణం అంతా వెతుకులాట మొదలుపెట్టారు.. చివరకు వధువును అలంకరించిన గదిలోనే ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది.. తేరుకుని పరిశీలిస్తున్న సమయంలో తేలిన విషయం ఏమిటంటే.. వధువుకు మత్తుమందు ఇచ్చిన అగంతకులు ఎవరో ఆమె మెడలోని ఆభరణాలు చోరీ చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.



