లోకల్ వార్‌లో ఫ్యాన్ రెక్కల వేగానికి సైకిల్ గాలి తుస్సుమంది. పెద్ద పెద్ద నాయకుల సొంతూళ్లలో కూడా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. టీడీపీ ఓటమిలో జనసేన కూడా కీలకంగా మారింది. ఊహించని విధంగా జనసేన చాలాచోట్ల విజయం అందుకుంది. వైసీపీకు ధీటుగా పోటీనిచ్చేసత్తా మున్ముందు జనసేనదే అనే భావన ప్రజల్లో బలపడుతుందనేందుకు ఇదే సంకేతం. అంత వరకూ బాగానే ఉంది.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అదే దూకుడుతో విజయం సాధిస్తామనే ధీమాగా ఉంది. కానీ అంతర్గత కుమ్ములాటలు.. పలు మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు మధ్య ఉన్న విబేధాలు.. పట్టణ ఓటర్లు వైసీపీ పట్ల వ్యతిరేకంగా ఉండటం వంటి అంశాలు ఆలోచనలో పడేశాయి. ఇది చాలదన్నట్టుగా.. మున్సిపాలిటీల్లో టికెట్ ఆశించిన రాని వైసీపీ కార్యకర్తలు, నాయకులు చాలాచోట్ల రెబెల్స్‌గా బరిలోకి దిగారు. వీరిని నామినేషన్ ఉపసంహరించుకునేలా చేయటం సవాల్‌గా మారిందట. దీంతో తమ వాళ్ల చేతిలోనే తమకు పరాభవం జరుగుతుందనే గుబులు వెంటాడుతుందట. మరి దీన్ని అధిగమించి రెబెల్స్‌ను బుజ్జగించే పనిలో నేతలు రంగంలోకి దిగారట. ఎందుకంటే.. మొన్న లోకల్ ఎలక్షన్స్‌లోనూ చాలా గ్రామాల్లో వైసీపీ రెబెల్స్ విజయం సాధించటంతో ఇప్పుడు మున్సిపోల్స్‌లో వైసీపీను వెంటాడుతున్న భయం.



