పల్లె ప్రజలు వైసీపీను ఆదరించారు. జగన్ అంటే మా పెద్దన్న అనేంతగా ఓట్లు వేశారు. పదేళ్ల క్రితం ఇదే జగన్ మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర చేస్తుంటే ప్రస్తుత విపక్షాలు ఎద్దేవాచేశాయి. అవినీతి ఆరోపణలతో జైలు ఊచలు లెక్కబెట్టిన జగన్ పాదయాత్రలు ఏపీలో పనిచేయవన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డినే జనం మరచిపోయారు.. ఇక ఆయన వారసుడిని ఏం గుర్తుంచుకుంటారంటూ వ్యంగాస్తాలు వదిలారు. కానీ.. 2019 ఎన్నికల్లో ఓట్ల సునామీతో… గెలుపు ప్రభంజనంతో జగన్‌ను గద్దెనెక్కించారు. 157 అసెంబ్లీ సీట్లు అనేది మామూలు విషయం కాదు.. 1980 దశకంలో ఒకే ఒక్కడు… నందమూరి తారకరామారావు రికార్డులు తిరగరాశాడు. ఆ తరువాత వైఎస్ ఆర్ చరిష్మాతో దుమ్మురేపాడు. ఇన్నేళ్లకు మళ్లీ వైఎస్ వారసుడుగా జగన్ మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించాడు. ఏపీ ఉన్నంత కాలం తాను ఉండాలని తపించిన ఆయన సంకల్పం సాధించిన విజయంగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇదంతా నాణేనికి ఒక వైపు.. జగన్ అంటేనే.. మొండి .. జగమొండి. అంటూ కార్యకర్తలు, అభిమానులు కూడా అన్నమాటకే దాసోహం అయ్యారు. గుళ్లపై దాడులు.. హిందుత్వానికి వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నాలు. ఇవన్నీ దాటుకునే సమయంలో కోర్టు చిక్కులు. అంతర్గత తలనొప్పులు.. సొంతపార్టీ నేతల నోటిదురుసు..
ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ లోకల్ వార్‌కు సిద్ధమన్నాడు. మీకింత ఉబలాటంగా ఉంటే.. మాటలెందుకు చేతలేనంటూ సై అన్నాడు. అన్నమాటకు ఫ్యాన్ రెక్కలు వేగం పెంచాయి. ఊహకు అందని విధంగా టీడీపీను మట్టికరిపించాయి. అంతే.. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు దిక్కులు చూస్తున్నారు. కొందరు పిక్కలకు బుద్ది చెబుతున్నారు. ఇంకొందరు అజ్ఞాతంలోకి జారుకున్నారు. ఇదంతా తమ అవినీతి చిట్టా బయటకు తీసి ఎక్కడ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం జైలుకు పంపుతుందనే భయమేనంటున్నారు విశ్లేషకులు. నిజమే.. అవినీతికి పరాకాష్టగా మారిన టీడీపీ ప్రభుత్వం తమ వాళ్లను ఏమీ చేయలేకపోయింది. డీజీ స్థాయిలో ఏబీ వెంకటేశ్వరావు ఇజ్రాయేల్ నుంచి ఆయుధాలు తెప్పించటం సంచలనంగా మారింది. ఈఎస్ ఐ మందుల స్కామ్, మైనింగ్ మాఫియాలతో అచ్చెన్నాయుడు, జేసీ బ్రదర్స్, యరపతినేని శ్రీనివాసరావు, రౌడీయిజంతో ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చేలా వ్యవహరించిన చింతమనేని ప్రబాకర్ ఇలా.. అందరూ ఊచలు లెక్కబెట్టే తరుణం వచ్చిందని వైసీపీ సంకేతాలు పంపింది. అయినా పద్దతి మార్చుకోలేని వారిపై కేసులు నమోదు చేయించి చట్టపరంగా చర్యలు తీసుకుంది.. ఇలాంటి సమయంలో సానుభూతి తమను గద్దెనెక్కిస్తుందని ఎంతో ఆశపడిన చంద్రబాబు అండ్ తెలుగు తమ్ముళ్లకు పల్లె ఓటర్లు ఝలక్ ఇచ్చారు. చాల్లే మీ వేషాలంటూ వెనక్కినెట్టారు. జనం కోసం జగన్ అనే నినాదాన్ని నిజం చేస్తూ జగన్ కోసం కూడా జనం అనేంతగా ఓట్లు కురిపించారు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు ఇక్కడైనా తమను అర్బన్ ఓటర్లు కనికరించకపోతారా! అని తెలుగు తమ్ముళ్లు గంపెడాశలు పెట్టుకున్నారట. మరి అది ఎంత వరకూ నిజమవుతుందనేది చూడాలి.