ఏపీలో ఆ మూడు మున్సిపాలిటీలు నేత‌ల‌ను వ‌ణికిస్తున్నాయ‌ట‌!

ఏపీలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల జోరు ఊపందుకుంది. ఇప్ప‌టికే ప‌లు రాజ‌కీయ‌ప‌క్షాలు ప్ర‌చారం ముమ్మ‌రం చేశాయి. పార్టీ గుర్తుతో జ‌రిగే ఎన్నిక‌లు కావ‌టంతో వైసీపీ, టీడీపీల‌కు వ‌ణ‌కు మొద‌లైంది. అస‌లు జ‌న‌సేన పార్టీయే కాదంటూ ఎద్దేవా చేసిన ఆరెండు పార్టీల‌కు మొన్న‌టి పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని కి ఎంత ప్ర‌జాధ‌ర‌ణ ఉంద‌నేది ఆ పార్టీల‌కు మింగుడుప‌డ‌కుండా చేస్తోంది. ప‌వ‌న్ అంటే కేవ‌లం ఇలా వ‌చ్చి అలా వెళ్లే నేత‌గానే అంచ‌నా వేసుకున్న వాళ్లకు.. ప‌వ‌న్ మాట‌లు యువ‌త‌పై ఎంత‌టి ముద్ర వేశాయ‌నేది ప్ర‌త్య‌క్షంగా చూశారు. విజ‌య‌వాడ‌… విశాఖ.. గుంటూరు.. మూడు గ్రేట‌ర్ న‌గ‌రాలు. పైగా అమ‌రావ‌తి, విశాఖ‌ప‌ట్ట‌ణం మ‌ధ్య రాజ‌ధాని ర‌గ‌డ జ‌రుగుతున్న స‌మ‌యం కూడా.. ఇప్పుడు టీడీపీ విజ‌య‌వాడ‌, గుంటూరు మున్సిపాలిటీల‌ను సొంతం చేసుకోవ‌టం ద్వారా ప్ర‌జ‌ల్లో అమ‌రావ‌తి సెంటిమెంట్ ఉంద‌నే భావిస్తున్నారు. విశాఖ‌ప‌ట్ట‌ణం ప్ర‌జ‌లు త‌మ‌కే జై కొడ‌తార‌ని వైసీపీ తెగ అంచ‌నాలు వేసుకుంటుంది. వైసీపీ పెద్ద‌న్న విజ‌య‌సాయిరెడ్డి అక్క‌డే మ‌కాం వేశారు. మంత్రులు అవంతి, ఆళ్ల ఇద్ద‌రూ కూడా విశాఖ‌లో వైసీపీకు ఎక్క‌డా ఓటు బ్యాంకు పోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. మూడు ప్ర‌ధాన న‌గ‌రాలు కావ‌టంతో అక్క‌డ ఏం జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. మూడు ప్రాంతాల్లోనూ జ‌న‌సేన‌, బీజేపీల‌కు ప‌ట్టు ఉండ‌టంతో జ‌న‌సేన పోటీ చేసిన స్థానాల్లో గెలిచేందుకు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ వీలైనంత ఎక్కువ సీట్లు గెలుచుకుని సేనాని బ‌హుమ‌తిగా ఇవ్వాల‌ని జ‌న‌సైనికులు భావిస్తున్నారు. వైసీపీ, టీడీపీ కార్య‌క‌ర్త‌లు కూడా ఈ మూడు స్థానాల్లో చావో రేవో అనేంత‌గా చెమ‌టోడ్చుతున్నారు.

Previous articleపాపం గుడుల మంత్రికి పెద్ద గండ‌మే!
Next articleగ్రంథికి ప‌వ‌న్ దెబ్బ గ‌ట్టిగానే త‌గిలిన‌ట్టుందే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here