ఆంధ్ర ప్రదేశ్ లో ఎంట్రన్స్ టెస్ట్ లను వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఎంసెట్ తో పాటు మొత్తం ఎనిమిది ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లుగా ఆయన తెలిపారు. తిరిగి నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి చెప్పారు.



