‘ ప్రాణంలో ప్రాణమా ‘ చిత్ర టైటిల్ సాంగ్ ఆవిష్కరణ !!!

‘ప్రాణంలో ప్రాణమా’ చిత్ర టైటిల్ సాంగ్ ఆవిష్కరణ !!!

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న చిత్రం ‘ప్రాణంలో ప్రాణమా’ ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక డిప్యూటీ సిఏం జి.పరమేశ్వర రావు గారి ఆత్మీయ మిత్రుడు ఖాదర్ బాషా పాల్గొన్నారు.

కుషాల్, అన్విష, జీవన్ రెడ్డి, కమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎన్ ఎస్ హనుమంత రెడ్డి నిర్మాత, భార్గవ గొట్టిముక్కల దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ స్టార్ ఎల్.ఎమ్ ప్రేమ్

తాను ప్రేమిస్తున్న కాజల్ జీవితంలోకి ఇంకో అబ్బాయి రావడంతో, కాజల్ ని అపార్ధం చేసుకుంటాడు కుషాల్.
తరువాత ఒకరునొకరు అర్థం చేసుకొని కుషాల్ కాజల్ లు కలిసిపోతారు. ఇది ఈ చిత్ర ముఖ్య కథాంశం, సరికొత్త స్క్రీన్ ప్లే తో దర్శకుడు భార్గవ గొట్టిముక్కల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రానికి డాన్స్ మాస్టర్ జి శంకర్, సినిమాటోగ్రఫీ పిచ్చారాగాడి మణి, లిరిక్: శ్రీరామ్ తపస్వి, మేకప్: నగేష్, సింగర్: వినాయక్. త్వరలో ఈ చిత్రానికి సంబందించిన టీజర్, ట్రైలర్, రాబోతున్నాయి.

Previous articleన్యాయవ్యవస్థలో కృత్రిమ మేధ (AI) ఆవశ్యకత: ఒక నూతన శకం – అవకాశాలు, సవాళ్లు
Next articleవీవీ వినాయక్ క్లాప్‌తో ‘కట్ట ప్రొడక్షన్ నెం.2’ ప్రారంభం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here