హవ్వా.. ఇదేం చోధ్యమని ఆశ్చర్యపోకండే.. ఎందుకంటే.. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో అంచనా వేయటం చాలా కష్టం సుమీ. అయితే మీరు అనుకున్నట్టు రెండుసార్లు ఊచలు లెక్కబెట్టించిన వైసీపీ సర్కారు దెబ్బకు తెలుగు తమ్ముళ్లు నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తున్నారట. టీడీపీ గ్రాఫ్ పెంచుదామని పెద్దాయనేదో ఎన్నికలు జరిపిస్తే చివరకు అది పసుపు గూటికే తలనొప్పిగా మారిందట. తూచ్.. అంతా మావాళ్లే గెలిచారు. వైసీపీ ఇకలేదంటూ చంకలు గుద్దుకుంటూ చంద్రబాబు చేస్తున్న కామెంట్లు మరింత నవ్వు తెప్పిస్తున్నాయంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇటువంటి సమయంలో అచ్చెన్న తాను జగన్ వెంట నడుస్తానంటున్నాడు.. అదంతా పొలిటికల్ డ్రామా అనుకోవద్దు. విశాఖ ఉక్కుపరిశ్రమను ప్రయివేటు పరం చేయటంపై జగన్ నాయకత్వం వహిస్తే .. తాము కూడా జగన్ వెంట నడుస్తామంటున్నారు. అచ్చెన్న వరకూ ఓకే కానీ.. పాపం టీడీపీ సోదరులకే దిమ్మె తిరిగిందట. మా నాయకుడు చంద్రబాబు ఉండగా.. జగన్ వెంట నడవటం ఏమిటంటూ అచ్చెన్న కామెంట్స్ పై కాస్త మనసు నొచ్చుకున్నట్టుగా చెప్పారట. ఏమైనా.. రెండుసార్లు జైలు కెళ్లిరావటం.. అచ్చెన్నలో మార్పునకు కారణమంటున్నారు. ఈ లెక్కన.. భూమా అఖిలప్రియ, జేసీ బ్రదర్స్, కొల్లు రవీంద్ర.. ఇలా చాంతాడంత జాబితాలోని తెలుగు తమ్ముళ్లు మున్ముందు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారిందన్నమాటే.