చదువు.. జీవితాన్నిస్తూ.. సమాజాన్ని.. దేశాన్ని నడిపించేదిగా ఉండాలంటారు విద్యావేత్తలు. మార్కులు, ర్యాంకుల కొలమానం అవతల.. విద్యార్ధి మనోవికాసం గుర్తించాలంటారు. వ్యక్తిగత వికాసం వల్లనే అభివృద్ధిఫలాలు అందుతాయంటూ పలు విద్యా పరిశోధనలు చెబుతున్న సారాంశం. నవసమాజ నిర్మాణానికి విద్య పునాది. ప్రపంచానికి దిశానిర్దేశం చేయగల మేథోసంపత్తి ఉన్న భారతదేశంలో సరికొత్త విద్యావిధానం. ఎంచుకున్న లక్ష్యాలను చేరువచేస్తుందనే భరోసా విద్యానిపుణుల్లోనూ ఉంది.
కేంద్ర మాజీ కార్యదర్శి టి.ఎస్.ఎల్.సుబ్రహ్మణ్యన్, ఇస్రో మాజీ అధ్యక్షులు డా.కృష్ణస్వామి కస్తూరి రంగన్ నివేదికలు యునెస్కో ప్రతిపాదనల ఆధారంగా నూతన విద్యా విధానం రూపుదిద్దుకుంది. ఈ విధానం విద్యార్దులకు, నవ సమాజ నిర్మాణానికి ఎంతవరకు ఉపకరిస్తుందనే అంశాన్ని.. సాధ్యాసాధ్యాలను పరిశీలిద్దాం..!!
భారత దేశం అనాది నుండి విద్యకు, మేధావులకు, నూతన సంస్కృతులు, మతాలు, సిద్ధాంతాలకు పుట్టినిల్లు. దాదాపు 15 శతాబ్దాల క్రితం విజ్ఞాన ప్రసాద భాoడాగారాలుగా వెలుగొందిన తక్షశిల , నలంద విశ్వవిద్యాలయాలు సజీవసాక్ష్యంగా ఉన్నాయి. ఇక్కడ విద్యనభ్యసించిన వేలాది విదీశీ విద్యార్థులు భారతీయ విద్యా విధానాన్ని, సాంకేతికతను వేనోళ్ళ స్తుతించారు. భాస్కరుడు, వరాహమిహిరుడు, ధన్వంతరి, చరకుడు వంటి శాస్త్రవేత్తలు భారతీయులవడం గొప్ప గర్వకారణం. కొందరు విదేశీ రాజులు ఈ విశ్వవిద్యాలయాలపై దాడులు చేసి విలువైన గ్రంథ సంపదను దోచుకెళ్లారంటే మన దేశీయ జ్ఞాన సంపద ఆ నాడే ఎంత ఉందనేది అర్ధంచేసుకోవచ్చు. మొఘలులు, తురుష్కులు,ఆంగ్లేయులు, డచ్చి, ఫ్రెంచి వాళ్లు భారత దేశంలో తిష్ట వేసి ఎవరికి అనుకులాంగా వారు విద్యావిధానాన్ని, భాషను, సంస్కృతులను మార్చుకున్న నేపథ్యంలో భారతీయ విద్య 500 సంవత్సరాల పాటు సంకరకరణ ( Hybridization) కు గురి అయిందనేది బహిరంగ విషయం..దీనిని సంస్కరించే ప్రక్రియలో, భారత స్వతంత్ర కాలం నాటిబనుండి అనేక విద్యా కమిషన్ల నివేదికల ప్రకారం విద్యా విధానంలో మార్పులు జరుగుతూ వచ్చాయి.. వాటిలో ముఖ్యంగా…
డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఉన్నత విద్యపై వేసిన
University Education Commission..1948,
మాధ్యమిక విద్యపై 1952-53 లో వేసిన
డా.లక్ష్మణస్వామి ముదలియార్ కమిటీ..
మన విద్యావిధానంలో సమూల మార్పులను సూచించిన ప్రో.డా.దౌలతసింగ్ కొఠారి కమిషన్ (1964-66 )
జాతీయ విద్యావిధానం..1968
1979, 1986 చెప్పుకోదగినవి..
1985-86 లో చైనాలోని బీజింగ్ లో జరిగిన అంతర్జాతీయ విద్యా సమావేశం లో నిర్ణయించిన అందరికీ విద్య(Education for All) నినాదంతో అనేక దేశాలు విద్యావిధానంలో కొత్త ఒరవడి సృష్టించాయి.. అదేవిధంగా ప్రపంచవ్యాప్త సాంకేతిక విద్యాభివృద్ది, 1991 లో వచ్చిన నూతన సంస్కరణలు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ ల్లో భాగంగా విద్యావిధానం యొక్క లక్ష్యాలు జాతీయ అవసరాలకే కాకుండా అంతర్జాతీయ అవసరాలను తీర్చే దిశలో నూతన విద్యా విధానం అవస్యమైనది..ఇంకా కాస్త ఆలస్యమైందనే చెప్పొచ్చు..
నూతన విద్యా విధానం.2019-20 ముఖ్యాంశాలు..
*భారత్ విశ్వగురు గా అవతరించాలని
** వ్యక్తి , సమాజం, దేశ పునర్నిమాణ దిశలో విద్య
**అందరికీ ప్రీ ప్రైమరీ విద్య
**2025 నాటికి నూరుశాతం అక్షరాస్యత
** ప్రస్తుతం ఉన్న 10+2+3 కర్రికులం స్థానం లో 5+3+3+4
**త్రీభాషా సూత్రం అమలు
**ప్రాచీన భాషలయిన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా, పాళీ, ప్రాకృత మరియు పర్షియన్ భాషలకు ప్రాధాన్యతనివ్వడం..
** కొత్తగా రాష్ట్రీయ పాఠశాల నియంత్రణాధికార సంస్థ స్థాపన
**పరిశోధనాలయాలు, బోధన విశ్వవిద్యాలయాలు, స్వయం ప్రతిపత్తి కల్గిన డిగ్రీ కళాశాలను సమీకృతం చేసి అనుసంధానం చేయుట
**స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఉన్నత విద్యాలయాలు, సంస్థలన్నిటినీ స్వతంత్ర బోర్డ్ ద్వారా పరిపాలన..
**పార్లమెంట్ చట్టం ద్వారా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపన..
** ప్రధాన మంత్రి అధ్యక్షతన రాష్ట్రీయ శిక్ష ఆయోగ్ జాతీయ విద్యా కమీషన్ అనే అత్యున్నత సంస్థ స్థాపన.
** కేంద్రం లో మానవ వనరుల మంత్రిత్వ శాఖను , విద్యా మంత్రిత్వ శాఖగా మార్పు
**ఎం.ఫిల్. కోర్సు రద్దు
** ఇప్పటి వరకు ఉన్న 14 సం. ల లోపు ఉన్న బాలలకు ఉచిత విద్య హక్కును 18 సం. ల లోపు వారికి అవకాశం కల్పించడం
**మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన జరగాలని
**ఉపాధ్యాయ విద్యలో పరిశోధనలు పెంచడం
ఈ లక్ష్యాలు నెరవేరాలంటే
గత గణాంకాలను విశ్లేషించుకొని రాబోయే కాలంలో నిర్దేశిత ప్రమాణాలను నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది..
* స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి ) లో ప్రస్తుతం విద్యకు ఉన్న కేటాయింపులు 6% నుండి 20 శాతం వరకు పెంచడానికి ప్రతిపాదన..
వార్షిక బడ్జెట్ లో కేటాయింపులతో పాటు, కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత నిధి(Corporate Social Responsibility Fund ) ద్వారా నిధుల సమీకరణ తద్వారా విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, అధ్యాపకుల ఉద్యోగాల నూరుశాతం భర్తీ, సున్నిత అంశం అయిన త్రి భాషా సూత్రం అమలులో సమస్యల పరిష్కారించుకోవడం
*విద్యార్థి, ఉపాద్యాయుడు నిష్పత్తి తగ్గింపు..
భారతదేశంలో సగటున ఒక టీచర్ కి 24 మంది విద్యార్దులున్నారు
(PTR…24:1)
చైనా…16:1, బ్రిటన్..16:1, స్వీడన్..12:1, కెనడా..9:1 గా దక్షిణాఫ్రికా..33.6:1 , నేపాల్ మరియు శ్రీలంక..23:1, భూటాన్..23:1ఉంటే పాకిస్తాన్ లో 46:1 Pupil Teacher Ratio నమోదయ్యింది.
భారత్ లో ఈ నిష్పత్తి 10:1 కి తగ్గించాలని విద్యావేత్తల అభిప్రాయం..
*ఉపాధ్యాయుల స్త్రీ పురుష నిష్పత్తి చూసినట్లయితే..
పురుషుడు:స్త్రీ ..100:72
సామాజిక నిష్పత్తి చూసినట్లయితే
SC- 100 : 56
ST – 100 : 66
OBC-100 : 68
కేంద్రప్రభుత్వ నినాదం
బేటీ పడాఓ- బేటీ బచావో
సఫలీకృతం కావాలంటే స్త్రీ నిష్పత్తి పెరాగాలి.
*2017-18 జాతీయ సర్వే లో ఉన్నత విద్య విషయంలో పరిశీలించినట్లయితే విద్యాసంస్థల సంఖ్య 32.3% నుండి 36.6% పెరిగినా అధ్యాపకుల సంఖ్య 13,67,535 నుండి 12,84,755 కి పడిపోవడం గమనార్హం..అదే విధంగా సుమారు లక్షా మూడు వేల ప్రాథమిక పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు పని చేస్తుండటం ఆందోళన కలిగించే విషయం..
*ప్రభుత్వాలు విద్యా శాఖను మిగతా శాఖల వలె వ్యయ లాభ విశ్లేషణ(Cost Benefit Analysis ) కోణంలో చూడటం వలన, విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందనడంలో సందేహం లేదు..
*సామాజిక శాస్త్రాల అధ్యయనం, పరిశోధనల్లో బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం, సామాజిక శాస్త్రాలు చదివిన విద్యార్థులకు, పరిశోధకులకు ఉపాధి అవకాశాలు, గౌరవం లేకపోవడం వలన ఈ శాస్త్రాల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు..ఇలాగే కొనసాగితే నూతన విద్యావిధానం లక్ష్యం..CHARACTER BUILDING నెరవేరదు..
*విద్యార్థి తనకు ఆసక్తి ఉన్న అంశాలను ఎంపిక చేసుకోవడంలో స్వేచ్ఛ ఇవ్వడం..ఇది మంచి పరిణామం…కానీ ఈ దిశలో తరగతి గదులు, ప్రయోగశాలలు,
తాత్కాలిక పద్ధతిన అధ్యాపకుల నియామకం అశాస్త్రీయంగా ఉంది, దీనిని సంస్కరించి
అర్హులయిన అదనపు అధ్యాపకుల నియామకం,
వంటి సౌకర్యాలు సమకూర్చకపోతే ఈ లక్ష్యం నెరవేరదు..
*ఒక విద్యార్ది డిగ్రీ స్థాయి విద్య అయిపోయాక ఇంటర్న్ షిప్ అన్ని కోర్సుల్లో అవసరం..
*వృత్తి విద్యా కోర్సుల్లో ప్రాక్టీకల్ శిక్షణ మరియు పారిశ్రామిక సంస్థల్లో ఆన్ జాబ్ ట్రైనింగ్ పటిష్టంగా అమలు పరచాలి..
*ఎలిమెంటరీ స్థాయినుండి ఉన్నత విద్య వరకు అధ్యాపకులకు నిరంతర శిక్షణ అవసరం..
*విద్యారి స్వతంత్రంగా ఆలోచించి విషయాన్ని అవగాహన చేసుకొనే విధంగా విద్యా విధానంలో Student Centered కరిక్యూలం రూపొందించాలి..
*ప్రస్తుత విద్యా ఫలితాలు సామాజిక అవసరాన్ని తీర్చేవిగా లేవు..విద్య సముపార్జన దాని ఫలితాలు దేశీయ సామాజిక అవసరాలను తీర్చేదిగా ఉంటే, ఉపాధి దొరుకుతుంది, నిరుద్యోగం తగ్గుతుంది… Technical Know-How దిగుమతులు తగ్గుతాయి..
*కుల మత ప్రాంతాలకు అతీతంగా విద్య నందించి తద్వారా యువ విద్యావంతులు సామాజిక బాధ్యత, జాతీయత పట్ల భాద్యత తీసుకొనే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలి..
*పౌష్టికాహార లోపం, పేదరికం వలన డ్రాప్ ఔట్ రేట్ ప్రాథమిక స్థాయిలో పెరుగుతుంది. ఉన్నత పాఠశాలలు, జూనియర్ ,డిగ్రీ కళాశాలల్లో సరైన మరుగుదొడ్లు సదుపాయం లేకపోవడం, కింద కూర్చుని విద్యనభ్యసించ రావడం వలన, బాల్య వివాహాలు వంటి విధానాల వల్ల ఉన్నత విద్య 34 శాతానికే పరిమితం అయింది..ఈ విషయంపై కూడా దృష్టి పెట్టాలి..
టీచర్ ఎడ్యుకేషన్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయింది..ఈ దిశలో సమూల మార్పులు అవసరం..
మానసిక ఒత్తిడి లేని విద్యావిధానం అమలులోకి రావాలి..
అత్యంత ఉన్నత విద్యా సంస్థలుగా చెప్పుకుంటున్న IIT, NIT, IIM, IISC, IISER వంటి విద్యా సంస్థల్లో సైతం కాంట్రాక్ట్ పద్ధతిన బోధన సిబ్బంది మొక్కుబడి నియామక పద్దతి ఏ మాత్రం అనుచితం కాదు..రెండవది వీటిల్లో విద్యనభ్యసించిన విద్యార్దులు 80 శాతం విదేశాలకు తరలి పోతున్నారు..ఈ బ్రెయిన్ డ్రైన్ ( మేధో సంపత్తి వలస )ను నిరోధించి వారికి ఇక్కడే సరయిన సదుపాయాలు కల్పిస్తే దేశాభివృద్ధిలో భాగస్థులవుతారు.
అకాడమిక్ ఆడిట్స్ పూర్తిగా కనుమరుగయ్యాయి. దీనిద్వారా అకౌంటబిలిటీ తగ్గి నాణ్యమైన విద్య అందడంలేదు..
విద్యార్థి పెర్ఫార్మెన్స్ ఎవాల్యూషన్ పద్ధతులు సహేతుకరంగా లేవు..అందుకే నాణ్యమైన విద్యార్థులు బయటికి రావడంలేదు..దీనిని సంస్కరించాల్సిన అవసరం ఉంది..
దేశ జనాభాలో 80 శాతం వ్యవసాయం మీద ఆధారపడి వున్నారు కావున వ్యవసాయం సంబంధిత కళాశాలలు కోర్సులు స్థాపించాలి.
-భాగ్యలక్ష్మీ బొల్లెద్దు, ప్రభుత్వ అధ్యాపకురాలు
స్థల ప్రభావం వల్ల మరి కొన్ని అంశాలను ఇవ్వలేకపోతున్నాం..
(నూతన విద్యా డాక్యుమెంట్ మరియు ఇంటర్నెట్ ద్వారా సమాచార సమీకరణ చేయడమైంది)
Excellent Analysis
Worthy information… Let us all know abouy NEP. Good explanation mam…
Comprehensive Analysis
చాలా విపులంగా వివరించారు . మీరు చెప్పినవన్ని అమలయితే రాబోయే తరాలకు మంచి ఉపయుక్తం..