ఆయన ఉన్నంత వరకూ మేం ఎన్నికలు జరపబోమంటూ సర్కారు. ఎలాగైనా తన హయాంలోనే ఎన్నికలు నిర్వహించి పదవి నుంచి తప్పుకోవాలని ఎన్నికల కమిషనర్. ఇద్దరి మధ్య వార్ కోర్టుల వరకూ చేరింది. అక్కడ కూడా స్పష్టత రాకపోవటంతో ఇది ఎప్పటికీ ముగింపు పలుకుతుందనే అభిప్రాయం ఏపీ జనాల్లో కలుగుతోంది. ఏపీలో ఈ ఏడాది మార్చిలోనే స్థానిక ఎన్నికలు జరపాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంది. ఇంతలో కరోనా వైరస్ వ్యాప్తి పెరగటంతో రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారి నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయంతో తూచ్ అంటూ వైసీపీ ఆశలపై నీళ్లు చల్లారు. ఇది కాస్తా.. చినికి చినికి గాలివానగా మారింది. చివరకు నిమ్మగడ్డను రాత్రికిరాత్రే తొలగించేలా ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. కానీ.. కోర్టులు దీన్ని తప్పుబట్టటంతో మళ్లీ నిమ్మగడ్డ బాధ్యతలు చేపట్టారు. నిమ్మగడ్డ అంటే టీడీపీ ఏజెంట్‌గానే వైసీపీ చూస్తోంది. చంద్రబాబు కనుసన్నల్లోనే ఆయన విధులు నిర్వర్తిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో లోకల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఇప్పట్లో ఎన్నికలు జరపలేమంటూ ఫిబ్రవరిలో జరిపే ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వాలంటూ ఏపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది.
దీనిపై తాజాగా హైకోర్టు విచారణ జరిపింది. లోకల్ ఎలక్షన్స్ నిర్వహణపై స్టే ఇవ్వాలనే ప్రభుత్వ విజ్ణప్తిని హైకోర్టు త్రోసిపుచ్చింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఎన్నికల సంఘం తరపు న్యాయవాది అశ్విన్‌కుమార్ , ప్రభుత్వ న్యాయవాది దరపున వాదనలు వేడిపుట్టించాయి. ఎన్నికల నిర్వహాణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం ఉల్లంఘించిందంటూ ప్రభుత్వ న్యాయవాది తన వాదన వినిపించారు. తిప్పికొట్టిన ఎన్నికల సంఘం న్యాయవాది అశ్విన్ కుమార్. మూడుసార్లు ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని సంప్రదించినట్టు ఆధారాలు చూపారు. మరికొంత సమయం ఇవ్వాలంటూ కోరిన ప్రభుత్వన్యాయవాది. దీంతో కేసు విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.